తెలంగాణ

TG : సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ!

4 నిమిషాల పఠనం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్ భూములను నిషేధిత జాబితాలో చేర్చేందుకు జీవో 134ను ముఖ్యమంత్రి ఉపయోగించారని, దానిని నిలిపివేయాలని స్టీఫెన్ సన్ వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారించింది.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్ భూములను నిషేధిత జాబితాలో చేర్చేందుకు జీవో 134ను ముఖ్యమంత్రి ఉపయోగించారని, దానిని నిలిపివేయాలని స్టీఫెన్ సన్ వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ‘ఓటుకు నోటు’ కేసులో రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశాననే పగతో సికింద్రాబాద్ బోయిగూడలో తనకున్న 1936 చదరపు గజాల స్థలాన్ని జీవో 134ను అడ్డం పెట్టుకుని నిషేధిత జాబితాలో చేర్చేందుకు కుట్ర చేస్తున్నారని హైకోర్టులో స్టీఫెన్ సన్ వాదనలు వినిపించారు.

ఈ కేసును విచారణ అనంతరం జీవో 134ను నిలిపివేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తీర్పు కేవలం స్టీఫెన్‌సన్ భూములకు మాత్రమే వర్తిస్తుందని హైకోర్టు న్యాయమూర్తి స్పష్టంచేశారు.దీంతో నిషేధిత జాబితాలోకి తన భూమి వెళ్లకుండా స్టీఫెన్ సన్ అడ్డుకున్నారు.ఇదిలాఉండగా, స్టీఫెన్ సన్ వల్లే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే.

2015 జూన్‌లో జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆనాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి తన వర్గానికి ఓటు వేయడం కోసం స్టీఫెన్‌సన్‌కు రూ. 50 లక్షలు లంచం ఇచ్చేందుకు ఆశ చూశారని ప్రధాన ఆరోపణ.దీనికి సంబంధించి ఫుటేజీని చిత్రీకరించి ఏసీబీకి ఇవ్వగా వారు రేవంత్ రెడ్డి అరెస్టు చేశారు. ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగాయి. ఈ కేసులో అదనపు వాదనలు,ఆధారాలను సమర్పించడానికి అనుమతించాలని స్టీఫెన్‌సన్ దాఖలు చేసిన దరఖాస్తుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అయితే, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఈ కేసును ఉపసంహరించుకోవాలని స్టీఫెన్‌సన్‌ను బెదిరిస్తున్నారని విపక్ష బీఆర్‌ఎస్ నేతలు పలుమార్లు ఆరోపించారు. కాగా, ఓటుకు నోటు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అటాచ్ చేసిన రూ. 50 లక్షల ఉత్తర్వులను పీఎంఎల్‌ఏ అప్పిలేట్ ట్రిబ్యునల్ రద్దు చేసింది. లంచం డబ్బు ఇప్పటికే ఏసీబీ అధీనంలో కోర్టు ట్రయల్‌లో ఉన్నందున, ఈడీ మళ్లీ అటాచ్ చేయాల్సిన అవసరం లేదని ట్రిబ్యునల్ వెల్లడించింది.

#Stephen son#land#highcourt#telangana#Cm revanthreddy#vote for note case
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి