తెలంగాణ

TG : నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. నిరుద్యోగులకు శుభవార్త?

4 నిమిషాల పఠనం

నేడు తెలంగాణ మంత్రి వర్గం సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ ఉండనుంది. సాయంత్రం 4 గంటల సమయంలో ఈ సమావేశం ప్రారంభం కానుండగా, అంతకంటే ముందు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మంత్రులతో సీఎం అనధికారికంగా సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు.

నేడు తెలంగాణ మంత్రి వర్గం సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ ఉండనుంది. సాయంత్రం 4 గంటల సమయంలో ఈ సమావేశం ప్రారంభం కానుండగా, అంతకంటే ముందు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మంత్రులతో సీఎం అనధికారికంగా సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు. ఇదిలాఉండగా, కేబినెట్ సమావేశంలో చర్చించే అంశాలపై సీఎస్ సంజయ్ జాజు ముందస్తు కసరత్తు చేసినట్టు తెలుస్తోంది.

సచివాలయంలో ఉన్నతాధికారులతో నిన్న ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.వివిధ ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన ప్రధాన అజెండా ప్రతులు, చర్చించాల్సిన ముఖ్యాంశాలు, ప్రతిపాదిత బిల్లులను పరిశీలించారు. వాటిని కేబినెట్ సమావేశంలో చర్చించడానికి గల అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు తెలిసింది. తాజా కేబినెట్ సమావేశంలో ప్రస్తుతం అమలు అవుతున్న సంక్షేమ పథకాల పురోగతి, కొత్త ప్రాజెక్టులు, ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ, ఉద్యోగ నియామకాలు, బడ్జెట్ కేటాయింపులపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది.

దీనికి తోడు రాష్ట్రంలో కొత్త పెట్టుబడులు ఆకర్షించడం, పారిశ్రామిక ప్రాజెక్టులకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరగుతుందని ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపైనా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు దిశానిర్దేశం చేస్తారని సమాచారం. సాయంత్రం కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం, మంత్రివర్గం తీసుకున్న కీలక నిర్ణయాలను మంత్రులు మీడియాకు వెల్లడించనున్నారు.

ఇదిలాఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. ఈలోపు ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలు అన్నీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు.విద్యాశాఖను ఆయనే చూస్తున్నందున ఈ మేరకు నిరుద్యోగులకు ఈ కేబినెట్ సమావేశంలో ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన కొత్తలో భర్తీ చేసిన ఉద్యోగాల తర్వాత పోలీసుశాఖలో నోటిఫికేషన్లు మినహా ఇతర శాఖల్లో నోటిఫికేషన్లు రాలేదు. ఈసారి ప్రభుత్వ శుభవార్త చెబుతుందా? అని నిరుద్యోగులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

#Telangana#cabinet meeting#today#cm revanth reddy#congress#govt job notifications#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి