తెలంగాణ

TGSRTC : డోర్లు మూశాకే బస్సులు కదలాలి.. ఆర్టీసీ సంచలన నిర్ణయం

4 నిమిషాల పఠనం

ఆర్టీసీ బస్సులకు డోర్లు అమర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా కండక్టర్ ప్రవళిక మృతితో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో నడిచే అన్ని బస్సుల్లో ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నారు.

ఆర్టీసీ బస్సులకు డోర్లు అమర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా కండక్టర్ ప్రవళిక మృతితో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో నడిచే అన్ని బస్సుల్లో ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు ఉత్వర్వులు వెలువడ్డాయి. తలుపులు మూశాకే బస్సులు ముందుకు కదలాలని ఆదేశాలు సైతం జారీ అయ్యాయి. ఇది అన్ని రకాల బస్సులకు వర్తిస్తుందని టీజీఎస్ ఆర్టీసీ స్పష్టంచేసింది.

ముందుగా రాష్ట్రంలో డోర్లు లేని బస్సులను గుర్తించి వెంటనే అమర్చాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించింది. ఇదిలాఉండగా, రాష్ట్రంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ ఎక్స్ ప్రెస్, సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులకు మాత్రమే డోర్లు ఉన్నాయి. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు, నగరంలో నడిచే సిటీ బస్సులకు డోర్లు అసలే లేవు. సిటీ బస్సుల్లో ముందు, వెనుక నుంచి ఎక్కే సదుపాయం ఉన్నందున రెండు వైపులా డోర్లు అమర్చాల్సి ఉంటుంది.

అయితే, నగరంలో కాలేజీ యువతీయువకులు, ఉద్యోగులు ఉరుకుల పరుగుల జీవనం గడుపుతుంటారు. రన్నింగ్‌లో బస్సులు ఎక్కడం, దిగడం వారికి అలవాటు.డోర్లు ఏర్పాటు చేయడం వలన ఒకరి తర్వాతే ఒకరు బస్సు ఎక్కాల్సి ఉంటుంది. ఇది వారి ఉరుకుల పరుగుల జీవనాన్ని కాస్త ఆలస్యం చేసినా వారి జీవితానికి భద్రత కలిగిస్తుందని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.

ఇదిలాఉండగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మణుగూరు డిపోకు చెందిన మహిళా కండక్టర్ ప్రవళిక టికెట్ చిల్లర విషయంలో జరిగిన గొడవలో మహిళా ప్రయాణికురాలు నెట్టివేయడంతో కిందపడగా తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మొన్న రాత్రి తుదిశ్వాస విడిచింది. విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవళిక భౌతికకాయానికి నివాళి అర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

ఆమె కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు. సీఎం ఆదేశాల మేరకు ఆర్టీసీ, ప్రభుత్వం సంయుక్తంగా రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటు ఆర్టీసీ తీసుకున్న ప్రత్యేక పాలసీ నిర్ణయం ద్వారా బ్యాంక్ నుంచి బాధిత కుటుంబానికి రూ.కోటి ప్రమాద బీమా అందుతుందని తెలిపారు.

#Tgsrtc#doors close#all type of buses#telangana#minister ponnam prabakar#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి