ఆనాడు NTR నుంచి నేటి రేవంత్ రెడ్డి వరకు..
కోర్ సిటీలోని భూముల్లో ఇంకా ఆంధ్రా లాబీయిస్టులే?
ఎవరి ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వ భూములను కాజేయడమే పని?
తెలంగాణ ప్రభుత్వంలోనూ ఆనాడు, ఈనాడు వాళ్లు చెప్పిందే నడుస్తోంది?
ఫేక్ పత్రాల పెత్తనం ఇంకా ఎన్నాళ్లు?
మియాపూర్ భూముల తీర్పుతోనైనా స్వాధీనం చేసుకుంటారా లేదా?
టైటిల్యే కీలకం అని సుప్రీంకోర్టు చెప్పినా సీటీలోని వేల ఎకరాల ప్రభుత్వ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు?
సీఎం రేవంత్.. మీ ఇంటి చుట్టే ప్రభుత్వ భూమి 200 ఎకరాలు ఉంది.. కాపాడుతారా?
ఈనాటి నేతల మేత అంతా ఆనాటి మిగులు భూముల్లోనే ఉంది?
వాటిని కాపాడుకుంటే బంగారు తెలంగాణను చేయొచ్చు?
అధికారంతో ఇండ్లు వజ్రాలతో నిర్మించుకుంటూ లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు
ఆధారాలన్నీ మ్యాప్‌ల ద్వారా చూపిస్తున్నాం
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,
9848070809,
స్వేచ్ఛ చైర్మన్.
ఓఆర్ఆర్ లోపల ఎక్కడ ఖాళీగా భూములు ఉన్నా అవి ప్రభుత్వ భూములేనా? క్లియర్ టైటిల్ అయితే రింగ్ రోడ్డు అవతల కూడా రూ.50 వేలకు గజం జాగా అమ్ముకుంటూ, చుట్టూ అపార్ట్మెంట్స్, విల్లాలు నిర్మిస్తుంటే ఇక్కడ మాత్రం దశాబ్దాల కాలంగా ఎందుకు నిర్మాణాలు జరగడం లేదు. ప్రైవేట్ భూములు అయితే ఒకే చోట వందల ఎకరాలు ఉండవు. కోర్ ఏరియా అయినా అర్బన్ సీలింగ్ ఏరియా అయినా 1000 గజాల కంటే ఎక్కువ ఉండదు. కానీ, చట్టాలు అమల్లో ఉన్నా 30 ఏండ్ల తర్వాత వాళ్లకు అనుకూలంగా పేపర్స్ సృష్టించుకుని వేల కోట్ల భూములను కొట్టేస్తున్నారు.
ఆనాటి సర్వే నెంబర్ భూములు, ఇప్పటికీ మినిస్టర్ క్వార్టర్స్ అని చెప్పుకుని క్లైం చేసుకున్న మంత్రి వివేక్ ఫ్యామిలీ, 403 మొత్తం ప్రభుత్వ భూమి పట్టా భూమి అయితే అర్బన్ సీలింగ్ యాక్ట్‌లో ఎందుకు డిక్లేర్ చేయలేదు. మున్సిపల్ నెంబర్స్ ఇచ్చినా ఇంకా మిగులు భూమి ప్రభుత్వ భూమియే అని అమ్ముకుంటూ వేల కోట్లు సంపాదించారు.
ఆనాడు పెన్నా ప్రతాప్ రెడ్డి, పార్క్ హయత్ ఓనర్ మరో రెడ్డి, పక్కనే ఉన్న గుడిసెల వెంకటస్వామి ఫ్యామిలీ, వంశీరాం కట్టడాలు ఇలా చాలా ఉన్నాయి. భూములు ఎన్ని ఖాళీగా ఉన్నాయో చూస్తే మరో 100 ఎకరాలు కచ్చితంగా స్వాధీనం చేసుకోవచ్చు. స్వేచ్ఛ న్యూస్ దేవేందర్ రెడ్డి ఈ ప్రభుత్వ భూములపై మరిన్ని కథనాలు ఇస్తూనే ఉంటారు.
కోర్ సిటీలోని భూముల్లో ఇంకా ఆంధ్రా లాబీయిస్టులే?
ఎవరి ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వ భూములను కాజేయడమే ఆంధ్రా లాబీయిస్టుల పని. తెలంగాణ ప్రభుత్వంలోనూ ఆనాడు, ఈనాడు వాళ్లు చెప్పిందే నడుస్తోంది. ఇలా ఫేక్ పత్రాల పెత్తనం ఇంకా ఎన్నాళ్లు. మియాపూర్ భూముల తీర్పుతోనైనా భూములను స్వాధీనం చేసుకుంటారా లేదా. టైటిల్యే కీలకం అని సుప్రీంకోర్టు చెప్పినా సీటీలోని వేల ఎకరాల ప్రభుత్వ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ ఇంటి చుట్టే ప్రభుత్వ భూమి 200 ఎకరాల వరకు ఉంది. దానిని కాపాడుతారా. మిగులు భూములను కాపాడుకుంటే బంగారు తెలంగాణ చేయొచ్చు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో లక్షల కోట్ల ప్రభుత్వ భూముల కబ్జా..
ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే భారీగా అన్యాక్రాంతం..
నిజాం కాలం నాటి జాగీర్ , పైగా, పోరంబోకు, ఖరీజ్ ఖాతా, అసైన్డ్ , భూదాన్, సిలింగ్ సర్ల్పెస్ లాంటి ప్రభుత్వ భూముల్లో నకిలీ రికార్డులు సృష్టించి లంచాలతో రిజిస్ట్రేషన్లు చేయించుకుని కోర్టుల్లో కేసులు వేసుకుని పొందేలా చేస్తున్నారు. అందుకు ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్లకు బంగారు బాతుల తయారు అవుతున్నాయి. మధ్యవర్తుల సహాయంతో 5 ఏండ్ల ప్రభుత్వాలతో లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. ఒక్క ఉమ్మడి రంగారెడ్డి లోన్ సుమారు 2.16 లక్షల ఎకరాల వివిధ రకాల ప్రభుత్వ భూములు.. అందులో అసైన్డ్ భూమి 90,967 ఎకరాలు భూదాన్ భూములు 23,542 ఎకరాలు ఉండగా అందులో 7 వేల ఎకరాలకు పైగా వివాదాల్లో ఉన్నాయి.
ఒక్క శేరిలింగంపల్లిలోనే అత్యధికం.
ఏసియాలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా రికార్డులు ఉన్నా ఈ ఏరియాలో మియాపూర్ సర్వే నంబర్ 100,101 లో 551 ఎకరాల 1912 సర్వేలో సర్కారీ పోరంబోకు. జాగీర్ క్లెయిమ్‌లు, నకిలీ పహాణీలు, ల్యాండ్ గ్రాబింగ్ కేసులు ఇటీవలే సుప్రీం కోర్టు తీర్పు తో 55 వేల కోట్ల ఆస్తి కాపాడారు. 400 ఎకరాలు ఖాళీగా ఉంది. 150 ఎకరాలు కబ్జాలతో నిండిపోయింది.
2. గోపన్ పల్లిలో సర్వే నంబర్, 35,36, 37ల్లో వందల ఎకరాలను అప్పట్లో వివిధ వ్యక్తులకు కేటాయించారు. అసైన్డ్ పేర్లతో ఇప్పుడు భూభారతి కోర్టు కేసులు ఉన్నాయని క్లియర్ చేసుకుంటున్నారు. ఉద్యోగ సంఘాలకు, జర్నలిస్టులకు, యూనివర్సీటీలకు ఇచ్చిన తర్వాత మిగిలిన భూములను కబ్జా చేస్తున్నారు. సుమారు 100 ఎకరాలు.
3. హాఫీజ్ పేట్ సర్వే నెంబర్ 77–80 వరకు ముఖ్యంగా 80లో 484 ఎకరాలు మొత్తం 700–1,200 ఎకరాలు వివాదంలో ఉంటూ వస్తుంది. సుప్రీం కోర్టు కొన్ని సందర్బాల్లో ప్రయివేట్ ల్యాండ్ అని చెప్పింది కానీ అప్పటికే గోల్డ్ స్టోన్ ప్రసాద్ కి 90 ఎకరాల రికార్డులకు మొత్తం నగరం చుట్టు 9 వేల ఎకరాలను క్లైం చేశారు. అందులో షేర్ లింగం పల్లిలోనే మియాపూర్, హైదర్ నగర్ , హఫీజ్ పేట్ 2 వేల ఎకరాల్లో పైగా, జాగీర్ క్లెయిమ్‌లు. నకిలీ రికార్డులతో నిర్మాణాలు చేశారు.
4. ఖానామెట్ లో సర్వే నెంబర్ 11, 41 లో ప్రభుత్వ భూములు అనేకంగా ఉన్నాయి. అసైన్డ్ చేశారని ప్రీడమ్ ఫైటర్స్ , సైనికులకు కేటాయించినట్లు నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా వందల ఎకరాల్లో నిర్మాణాలు జరుపుకుంటున్నారు. 3 వేల అపార్మెంట్లు నిర్మించారు.
5. మాధపూర్ అయ్యప్ప సోసైటిలో సుప్రీం కోర్టులో కేసులు ఉండగానే ఖానా మెట్ భూములను నోటరీలతో ప్లోర్ కి 10 లక్షలు లంచాలు ఇచ్చి నిర్మించుకుంటున్నారు.
6. కొండ పూర్ లో వివాదస్పద భూముల్లో వందల ఎకరాల్లో సంపాదించారు.
7. పుప్పాల గూఢలో ఖాందీ షీకుల భూములను , సెల్ సర్టీఫికేట్స్ , కేటాయింపులు లేకుండానే వేల కోట్ల భూములను నకిలీ పత్రాలతో క్లైయిం చేసుకున్న వారిని కోర్టు కేసులు ఉన్నా, క్లియర్ చేస్తున్నారు.
8. గచ్చిబౌలి సర్వే నంబర్ 35 నుంచి 52 వరకు సిలింగ్ సర్ప్లేస్ , పీటీలు తో 300 ఎకరాలు వివాదంలో ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 60 ఎకరాలు క్లియర్ చేసుకుంది. మరో 40 ఎకరాలు ఈ ప్రభుత్వం నకిలీ పీటీ దారులకు క్లియర్ చేసి ఇచ్చేందుకు సిద్దమయింది. ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఈ భూమి కోల్పోతున్నారు.
9. గుట్టల బేగంపేట్ లోని సర్వేనంబర్ 63 లో 78.73 ఎకరాల భూమి వివాదంలో ఉంది .వక్ఫ్ ల్యాండ్ ప్రభుత్వ భూమిగా ఉన్నా కోర్టులో స్టేలు కొనసాగుతున్న కబ్జాలు అవుతున్నాయి.
10. గండి పేట మణికొండ జాగీర్ 1,654.32 ఎకరాలు వక్ఫ్ బోర్డు vs ప్రభుత్వం. దశాబ్దాల వివాదం. సుప్రీంకోర్టు 2022లో ప్రభుత్వానికే చెందుతుందని తీర్పు. కాని కాపాడటంలో విఫలం అయ్యారు. కబ్జాలు అయ్యాయి.
11. మహేశ్వరం మంఖాల్ Sy.No. 608, 609, 610 లో 35.36 ఎకరాలు 1954–55 ఖాస్రా పహాణీలో సర్కారీ. అసైన్డ్/ప్రభుత్వ భూమిని విల్లాలుగా మార్చారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన స్కామ్. రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.
12. కొత్వాల్‌గూడ , శంషాబాద్ సర్వే నంబర్ 54 లో 52 ఎకరాలు నిజాం కాలం నుంచి వివాదం. ప్రైవేట్ క్లెయిమ్‌లు. జిల్లా కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు 2025 లో అయినా ఇప్పటికి విదాలతో సతమతం అవుతున్నారు..
13. మహేశ్వరం నాగారంలోని భూదాన్ భూములు వందల ఎకరాలు ఉదా. Sy. 181, 182, 194 వినోభా భావే దానం భూముల్లో నకిలీ రికార్డులు, నిర్మాణాలు చేశారు. హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కలెక్టర్ అమోయ్ కుమార్ పై ఈడీ కేసు నమోదు చేసింది.
14. మంగళ్‌పల్లి (ఇబ్రహీంపట్నం): Sy.No. 96లో 4.34 ఎకరాలు పోరంబోకు భూమిని ఆన్లైన్లో ప్రైవేట్ పేరిట నమోదు చేశారు.
15. అసైన్డ్ భూముల్లో ఇప్పిటికే 20 వేల ఎకరాలు అక్రమంగా ప్రైవేట్ చేతిలోకి వెళ్లిపోయాయి. ప్రధానంగా మంఖాల్, తుక్కుగూడ, కందుకూరు, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్, మహేశ్వరం వంటి గ్రామాల్లో ఇలాంటి కేసులు ఎక్కువ. ఇవి వ్యవసాయ భూములుగా మాత్రమే వినియోగించాలి, బదలాయింపు చట్టవిరుద్ధం.
16. ఇబ్రహీంపట్నం పరిధిలోని భూదాన్ భూములు Sy. 162, 163, 165 లో 450 ఎకరాలు.
17. బొమ్మరాస్ పేట రైతుల ప్రైవేట్ భూముల్లో ఇష్టానుసారంగా రైతులకు తెలియకుండానే రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు. వందల కోట్ల భూమి చేతులు మారుతున్నాయి. 1000 ఎకరాలు.
18. కొంగర ఖుర్దులో రైతుల భూములను వక్ఫ్ భూములుగా చూపించి భయపెట్టించి ఇతర 400 ఎకరాలను కబ్జాలు చేసి స్వాధీనం చేసుకోవాలనే కుట్రలు జరుగుతున్నాయి. దోచుకుంటున్నారు.
19. ప్రభుత్వానికి దక్కాల్సిన గల్ప్ అయిల్ కార్పోరేషన్ భూములు ప్రయివేట్ వ్యక్తులకు చేర్చారు. హైకోర్టులో కేసులు కొనసాగుతుండగా 6 నెలలు అయినా ప్రభుత్వం , మేడ్చల్ కలెక్టర్ ఇప్పటికి కౌంటర్ దాఖలు చేయలేదు.
20. కొండకల్ , వెలిమల లో లంబాడీల భూములను విక్రమ్ రెడ్డి దొర అనే వ్యక్తి కి అక్రమంగా రికార్డులు ధరిణిలో మార్చి అపర్ణ లాంటి కంపనీలకు క్లియర్ చేసుకున్నారు. అగ్రిమెంట్ల రూపంలో గిరిజనులను మోసం చేశారు. గ్యాబ్ ల్యాండ్ సుమారు 120 ఎకరాలను మాయం చేశారు.
21. ఖాజాగూఢ లో 27, 28 సర్వే నంబర్స్ లో వంశీరాం కి క్లియర్ చేశారు. సాస్ అనే కంపనీకి ఇటీవల 3 ఎకరాలు క్లియర్ చేసుకున్నారు.
22. నానక్ రామ్ గూఢలో కొంత మంది పెద్దలకు టీజీఐఐసీ భూములను ఇచ్చేస్తున్నారు.
ఇలా అనేక ప్రభుత్వ భూముల్లో నకిలీ పత్రాలతో వచ్చిన వారికి క్లియర్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.


