Tollywood: డాన్సింగ్ క్వీన్ శ్రీలీలకి ప్రస్తుతం తెలుగులో కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ కన్ఫర్మ్ కాలేదు. కానీ, కోలీవుడ్‌లో మాత్రం దూసుకుపోతోంది. బ్యాక్ టు బ్యాక్ కొత్త చిత్రాల్లో అవకాశాలు అందుకుంటుందోంది. అది కూడా ఊహించని కాంబినేషన్స్‌లో. ఒకప్పుడు టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోయిన శ్రీలీలకు ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. దీనికి, కారణం ఇక్కడ వరుసగా వచ్చిన ఫ్లాపులే.
ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకొని చేసిన సినిమాల ఫలితాలు నిరాశపరచడంతో కొత్త ప్రాజెక్టుల విషయంలో శ్రీలీలను అంతగా తీసుకునే ఆలోచన మేకర్స్ చేయడం లేదట. అయితే, శ్రీలీల క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని కోలీవుడ్‌లో ఆమెకు వస్తున్న అవకాశాలు చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా, తమిళ ఇండస్ట్రీలో వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
శ్రీలీల తమిళ సినిమాల్లోకి శివకార్తికేయన్ హీరోగా నటించిన 'పరాశక్తి'తో అడుగుపెట్టింది. ఆ తర్వాత ధనుష్, మమ్ముట్టి వంటి స్టార్ నటులు భాగమైన 'ఓఎం' సినిమాలో సాయి పల్లవితో పాటుగా అవకాశం దక్కించుకుంది. ఇలా తమిళంలో తన ప్రయాణాన్ని స్టార్ హీరోల సినిమాలతో కొనసాగిస్తోంది.
ఇక అజిత్ కుమార్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డేర్ డెవిల్' సినిమాలోనూ శ్రీలీల నటిస్తోంది. నవంబర్ 2న ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాదు, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో శ్రీలీల పాత్ర ఎలా ఉండబోతోందన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది.
అలాగే, శ్రీలీల ఖాతాలోకి మరో భారీ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ధర్మన్' సినిమాలో శ్రీలీల భాగమైంది. కమల్ హాసన్ ఈ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థలో నిర్మిస్తున్నారు. నవంబర్ 4న చిత్రబృందం అధికారికంగా శ్రీలీలను ప్రకటించింది.
ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు నయనతార, రాశీ ఖన్నా, సిమ్రాన్, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రజనీకాంత్‌తో శ్రీలీలకు ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఈ ప్రాజెక్ట్ ఆమె కెరీర్‌కు మరో ప్రత్యేకమైన గుర్తింపు దక్కడం గ్యారెంటీ. ఇక, ఈ సినిమాలో మన టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా నటిస్తున్నారు. మొత్తానికి, తెలుగులో ఆశించిన అవకాశాలు దక్కకపోయినా, తమిళ సినిమాలలో మాత్రం అద్భుతమైన అవకాశాలు అందుతున్నాయి.


