దేశంలోని మొబైల్ వినియోగదారులకు ఈ పండుగ వేళ ప్రముఖ టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్‌లు సరికొత్త వార్తను అందించాయి. టెలికాం నియంత్రణ సంస్థ, డాట్ (DoT) ఆదేశాల మేరకు కేవలం వాయిస్ కాల్స్ మాత్రమే కోరుకునే వినియోగదారుల కోసం ప్రత్యేకంగా 'వాయిస్ ఓన్లీ' (Voice Only) రీఛార్జ్ ప్లాన్లను రూ.200 లకే అందుబాటులోకి తీసుకొచ్చాయి.
డేటా అవసరం లేని సాధారణ ఫోన్ వినియోగదారులు, కేవలం ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ సేవలు మాత్రమే కోరుకునే ద్వితీయ సిమ్ (Second SIM) యూజర్లు, ఇళ్ల వద్ద వైఫై వినియోగించే వారికి ఈ తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్లు ఎంతో ఆర్థిక ఊరటనివ్వనున్నాయి. ఇప్పటివరకు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న దాదాపు అన్ని ఆఫర్లు డేటాతో కూడుకుని ఉండటం వల్ల, ఇంటర్నెట్ వాడని వారు కూడా గత్యంతరం లేక ఎక్కువ మొత్తంలో రీఛార్జ్ చేయించుకోవాల్సి వచ్చేది.
వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, విజ్ఞప్తులను పరిశీలించిన టెలికాం శాఖ (DoT) తక్షణమే కేవలం వాయిస్ ప్లాన్లను ప్రవేశపెట్టాలని టెలికాం కంపెనీలను ఆదేశించింది. రూ.149 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ నూతన టారిఫ్ ఆఫర్లు రీఛార్జ్ వ్యయాలను గణనీయంగా తగ్గించనున్నాయి.
ప్రధాన టెలికాం సంస్థల 'వాయిస్ ఓన్లీ' రీఛార్జ్ ప్లాన్ల వివరాలు:
రిలయన్స్ జియో (Jio): 22 రోజుల వ్యాలిడిటీతో రూ.147 ప్లాన్ అందుబాటులో ఉండగా, 28 రోజులకు రూ.177కాగా, 30రోజులకు రూ.196, ఒక క్యాలెండర్ నెలకు రూ.197గా నిర్ణయించింది. అదేవిధంగా 84 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్ ధర రూ.448గాను (1000 SMSలు), 336రోజుల వార్షిక ప్లాన్ ధర రూ.1748గాను అందుబాటులో ఉంచింది.
భారతీ ఎయిర్‌టెల్ (Airtel): 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.185 కాగా, 30 రోజులకు రూ.203, క్యాలెండర్ నెలకు రూ.206గా ఉంది. సుదీర్ఘ కాలం కోసం 84రోజుల ప్లాన్ రూ.469, 365రోజుల వార్షిక ప్లాన్ రూ.1849 ధరల్లో లభిస్తున్నాయి.
వొడాఫోన్ ఐడియా (Vi): 25 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.179 కాగా, 28 రోజులకు రూ.158లకు 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ రూ. 203గా అందుబాటులో ఉంది.
ప్రతి నెలా మొబైల్ రీఛార్జ్ రీచార్జ్‌ల కోసం అనవసరంగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే లక్షలాది మంది సామాన్య మొబైల్ వినియోగదారులకు, సీనియర్ సిటిజన్లకు ఈ ప్లాన్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. పండుగ ముందే అమల్లోకి వచ్చిన ఈ ప్యాక్‌లను టెలికాం కంపెనీలు తమ అధికారిక యాప్‌లు, వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచాయి.


