సినిమా

Tollywood: శ్రీకాంత్ కూతురు మేధా మేక కి వరుస ఆఫర్స్..కానీ అన్నీ ఒప్పుకోవద్దు!

4 నిమిషాల పఠనం

Tollywood: సీనియర్ నటీనటులు శ్రీకాంత్-ఊహల ముద్దుల కూతురు మేధా మేక హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతోంది. అంతేకాదు, అగ్ర నిర్మాణ సంస్థలలో అవకాశాలను అందుకుంటోంది. వరుస ప్రాజెక్ట్స్‌కి సైన్ చేస్తూ సినీ ప్రముఖులను షాకయ్యేలా చేస్తోంది. అయితే, ఇలా వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఒడిసి పట్టుకోకుండా ఒక్కో ప్రాజెక్ట్‌ను తన కెరీర్‌కి మంచి టర్నింగ్ పాయింట్ అయ్యేలా ఎంచుకోమని ప్రముఖులు సలహాలిస్తున్నారు.

మేధ హీరోయిన్‌గా పరిచయం అవుతున్న మొదటి సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో జై జాస్తి హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా 'మైత్రీ ఇన్ లవ్' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. '30 వెడ్స్ 21' వెబ్ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ వనం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పి. మహేశ్ బాబు క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలై విశేషంగా ఆకట్టుకుంది.

మోక్షజ్ఞ మొదటి సినిమాలోనూ ఛాన్స్ వచ్చిందా?

మేధకు సంబంధించి గతంలో మరో ఆసక్తికరమైన వార్త కూడా ప్రచారంలోకి వచ్చింది. నందమూరి మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన సినిమాలో మేధాను హీరోయిన్‌గా తీసుకోవాలని మేకర్స్ చర్చలు జరుపుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే, ఆ ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో అది అక్కడే ఆగిపోయింది. తాజాగా, మేధ మరో క్రేజీ సీక్వెల్‌లో నటించే అవకాశం ఉందంటూ ప్రచారం మొదలైంది. ఓ ప్రముఖ సీక్వెల్ కోసం ఆమె పేరు పరిశీలనలో ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

కొడుకు మేక రోషన్ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలలో ఉన్నాడు. ఇప్పటి వరకూ చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్‌ను ఇవ్వలేదు. ఇప్పుడు, శ్రీకాంత్, ఊహల కుమార్తెగా మేధపై సహజంగానే ప్రేక్షకుల్లో ఆసక్తి, అంచనాలు ఉంటాయి. ఇప్పటికే ఆమె సోదరుడు రోషన్ హీరోగా సినిమాలు చేస్తుండగా, ఇప్పుడు మేధ కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. గతంలో 'రుద్రమదేవి' సినిమాలో బాలనటిగా కనిపించిన మేధ, ఇప్పుడు కథానాయికగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

#Medha Meka#Crazy Offers For Medha Meka#Tollywood#Mythri Movie Makers
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి