సినిమా

Pooja Hegde: ఫ్లాపుల్లో ఉన్న హీరోయిన్‌కి పెళ్లిపై దృష్టి మళ్ళిందా?

రచన: Anshu4 నిమిషాల పఠనం

Pooja Hegde: మన సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అగ్ర కథా నాయికగా వెలుగుతున్న సమయంలోనే సహ నటులను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. కొందరు పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తుంటే కొందరు మాత్రం సంసార జీవితాన్ని సంపూర్ణంగా ఆనందించడానికి కొంతకాలం బ్రేక్ తీసుకుంటున్నారు.

Pooja Hegde: మన సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అగ్ర కథా నాయికగా వెలుగుతున్న సమయంలోనే సహ నటులను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. కొందరు పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తుంటే కొందరు మాత్రం సంసార జీవితాన్ని సంపూర్ణంగా ఆనందించడానికి కొంతకాలం బ్రేక్ తీసుకుంటున్నారు.

ఇంకొందరు, కెరీర్ నత్త నడకన సాగుతుండటం..వరుసగా ఫ్లాపులు వస్తుండటం..ఆశించినంతగా అవకాశాలు లేకపోవడం..దీంతో పెళ్లిపై దృష్టి పెడుతున్నారు. అలాంటి, జాబితాలోకి పూజా హెగ్డే వచ్చి చేరిందంటున్నారు. ఇప్పుడు, ఈ బుట్టబొమ్మ ఇంట్లో అమ్మానాన్నలు చూసే వరుడిని పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియా మొత్తం ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే, ఇప్పటి వరకూ ఈ వార్తలను పూజా ఖండించలేకపోవడం ఆశ్చర్యకరం.

మరి, దీనిపై ఈ బ్యూటీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక, సినిమాల విషయానికొస్తే, గత కొంతకాలంగా హిట్టు లేక రేసులో బాగా వెనకబడింది. ఇటీవల కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన జన నాయగన్ సినిమాతో బోలెడన్ని ఆశలు పెట్టుకొని వచ్చింది. అది కాస్తా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దాంతో, మళ్ళీ ఆశలన్నీ నిరాశలుగా మిగిలాయి.

ప్రస్తుతం పూజా చేతిలో రెండు సినిమాలు:

పూజా హెగ్డే కెరీర్ మలుపు తిరుగుందా లేదా తెలియదు గానీ ఇప్పుడు రెండు సినిమాలతో మాత్రం బిజీగా ఉంది. వాటిలో ఒకటి బ్లాక్ బస్టర్ సిరీస్ కాంచన 4. రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నాడు. కాంచన సిరీస్‌తో ఫ్లాపుల్లో ఉన్న రాయ్ లక్ష్మీ, తాప్సీ, నిత్యా మేనన్, రితిక సింగ్ లాంటి వారికి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. ఇప్పుడు కాంచన 4తో పూజా అలా సక్సెస్ కోసం ఆశగా చూస్తోంది.

మరో సినిమా దుల్కర్ సల్మాన్ నటిస్తున్న శ్రీశ్రీ. ఈ చిత్రానికి రవి నెలకుదిటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్ఎల్‌వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఇందులో, పూజా ఎంతో సహజమైన లుక్ లో కనిపించబోతోంది. ఇటీవల వచ్చిన దుల్కర్, పూజా ల పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు సినిమాలు గనక హిట్ అయితే మళ్ళీ సౌత్ లో ఈ బ్యూటీ సాలీడ్ గా బౌన్స్ బ్యాక్ అవుతుంది. లేదంటే, ఇక పెళ్లి చేసుకోవడమే మంచిది.

#poojahegde#srisri#kanchana4#RaghavaLawrence#DulquerSalmaan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి