National

National : గర్భా వేడుకల్లో బాలికతో అసభ్యప్రవర్తన..బీజేపీ నేతపై పోక్సో కేసు

రచన: Kumar••4 నిమిషాల పఠనం

అధికారం, పదవి అండ చూసుకుని కొందరు లీడర్లు హద్దు మీరుతున్నారు. తాము ప్రజాసేవకులం అని మరిచి నియంతలా వ్యవహరిస్తున్నారు. తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. తాము ఏం చేసినా నడుస్తుంది అనే భావనలో కొందరు నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.

అధికారం, పదవి అండ చూసుకుని కొందరు లీడర్లు హద్దు మీరుతున్నారు. తాము ప్రజాసేవకులం అని మరిచి నియంతలా వ్యవహరిస్తున్నారు. తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. తాము ఏం చేసినా నడుస్తుంది అనే భావనలో కొందరు నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.దీంతో కొందరు లీడర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పబ్లిక్ న్యూసెన్స్ చేయడంతో పాటు దాడులకు సైతం పాల్పడుతున్నారు. ప్రాపర్టీలను ఆక్రమించడం, బెదిరింపులకు గురిచేయడం, మాట వినడం లేదని ఎదురుతిరుగుతున్నారని ఆఖరుకు హత్యాయత్నాల వరకు వెళ్తున్నారు.

తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. దసరా నవరాత్రుల వేళ ఆ రాష్ట్ర రాజధాని ఇండోర్‌లో గర్బా వేడుకలను ఘనంగా నిర్వహించారు. చాలా మంది యవతీయువకులు అక్కడకు చేరుకుని గర్భా వేడుకల్లో ఆనందంగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్యర్యంలో ఈ వేడుకలు జరిగినట్టు సమాచారం.అయితే, వేడుకలు జరుగుతున్న సమయంలో స్థానికంగా ఉన్న ఓ బీజేపీ నేత దౌర్జన్యానికి దిగాడు. అక్కడకు వచ్చిన ఓ బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చాయి.

ఇండోర్‌ - హీరానగర్ ప్రాంతంలో ఉన్న కంకేశ్వరి గర్బా ఉత్సవ్‌ వద్ద 15 ఏళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించి, ఆమెను బీజేపీ మండల అధ్యక్షుడు కమల్ చౌహాన్ బయటకు నెట్టివేశాడు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి అతన్ను అడ్డుకునేందుకు యత్నించగా బూతులు తిడుతూ దాడికి యత్నించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. గర్భా వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన బాలిక ప్రవేశం విషయంలో వివాదం తలెత్తడంతో కమల్ చౌహాన్ తనతో అసభ్యంగా ప్రవర్తించి, బయటకు నెట్టివేశాడని సదరు బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

దీంతో సదరు బీజేపీ నాయకుడిపై పోక్సో చట్టంతో పాటు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 74 కింద కేసు ఫైల్ చేసినట్టు తెలిసింది. బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు అక్కడే ఉన్న పలువురిని భయభ్రాంతులకు గురిచేసినట్టు కూడా తెలుస్తోంది. కాగా, కేసు ఫైల్ చేసిన పోలీసులు సదరు బీజేపీ నేతను అరెస్టు చేసినట్టు సమాచారం. విచారణ అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపనున్నట్టు తెలుస్తోంది.

#madyapradesh#bjp leader#pocso case#misbehave#minor girl#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి