సినిమా

Mumbai : హీరో టైగర్ ష్రాఫ్‌ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ సంచలనం

రచన: Kumar••4 నిమిషాల పఠనం

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరోసారి కాల్పుల మోత కలకలం రేపింది. ప్రముఖ బాలీవుడ్ యాక్షన్ నటుడు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని కొందరు గుర్తుతెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఎట్టకేలకు సురక్షితంగా బయటపడగా.. ఆయన కారు డ్రైవర్‌తో పాటు మరో స్థానిక పౌరుడికి గాయాలయ్యాయి.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరోసారి కాల్పుల మోత కలకలం రేపింది. ప్రముఖ బాలీవుడ్ యాక్షన్ నటుడు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని కొందరు గుర్తుతెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఎట్టకేలకు సురక్షితంగా బయటపడగా.. ఆయన కారు డ్రైవర్‌తో పాటు మరో స్థానిక పౌరుడికి గాయాలయ్యాయి.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. టైగర్ ష్రాఫ్ తన కారులో ప్రయాణిస్తుండగా, ఒక ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు అగంతకులు వారిని వెంబడించారు. అదును చూసి నటుడితో పాటు ఆయన డ్రైవర్‌పైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో డ్రైవర్‌కు, అటుగా వెళ్తున్న మరో సామాన్య పౌరుడికి గాయాలు కావడంతో స్థానికులు వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. టైగర్ ష్రాఫ్ ఎలాంటి గాయాలు లేకుండా క్షేమంగా ఉన్నట్లు తెలిసింది.

తామే చేశామన్న బిష్ణోయ్ గ్యాంగ్..

కాల్పుల ఘటన జరిగిన కొద్దిసేపటికే, దీనికి తామే బాధ్యులమని కరుడుగట్టిన నేరస్థుడు 'లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్' ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలోనూ బాలీవుడ్ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా బెదిరింపులకు పాల్పడిన నేపథ్యంలో తాజా దాడి బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. కేవలం డబ్బుల కోసమే ఈ ముఠా ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడం, వారిని భయాందోళనకు గురిచేయడం వంటివి చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం బిష్ణోయ్ జైలులో ఉండగా, ఆయన సోదురుడిని కూడా గతంలో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జైలు నుంచే ఇలాంటి బ్లాక్ మెయిలింగ్, బెదిరింపులకు పాల్పడుతున్నట్టు సమాచారం. గతంలో సల్మాన్ ఖాన్ ఇంటిపైనా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే.

తాజా కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న ముంబై పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.కాల్పులు జరిగిన చోటులోని సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు జరిపి పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ దాడి వెనుక ఉన్న స్పష్టమైన కారణాలు, ఇతర పూర్తి వివరాలు పోలీసుల సమగ్ర దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది.

#tiger shroff#gun fire#mumbai#lawrence bishnoi#cinema#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి