సినిమా

Nayanthara: మూడవసారి రజినీతో జోడీ?

రచన: Anshu••5 నిమిషాల పఠనం

Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్‌తో చాలా బిజీగా ఉన్నారు. ఇటు సౌత్ అటు నార్త్ ఇండస్ట్రీలో నయన్ క్రేజ్ ప్రస్తుతం భారీ స్థాయిలో ఉంది. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్‌లో నయన్ హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. చేతిలో పలు భారీ చిత్రాలుండగా..ఇప్పుడు మరో క్రేజీ మూవీలో ఛాన్స్ అందుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ సినిమా సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ధర్మన్. త్వరలో, అఫీషియల్‌గా ప్రకటన రానుందట.

Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్‌తో చాలా బిజీగా ఉన్నారు. ఇటు సౌత్ అటు నార్త్ ఇండస్ట్రీలో నయన్ క్రేజ్ ప్రస్తుతం భారీ స్థాయిలో ఉంది. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్‌లో నయన్ హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. చేతిలో పలు భారీ చిత్రాలుండగా..ఇప్పుడు మరో క్రేజీ మూవీలో ఛాన్స్ అందుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ సినిమా సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ధర్మన్. త్వరలో, అఫీషియల్‌గా ప్రకటన రానుందట.

చంద్రముఖి జోడి:

తమిళం, తెలుగులో భారీ హిట్ సాధించిన సినిమా చంద్రముఖి. పి.వాసు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రభు-జ్యోతిక ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్‌కి నయనతార జంటగా నటించింది. ఈ సినిమా తర్వాత ఇప్పటి వరకూ నయన్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. చంద్రముఖి తర్వాత రజినీ-నయన్ కలిసి దర్భార్ మూవీ చేశారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్‌గా నిలిచింది.

ధర్మన్‌లో రజినీకి జోడీగా నయన్?

లెజండరీ యాక్టర్ కమల్ హాసన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న సినిమా ధర్మన్. సూపర్ స్టార్ రజినీకాంత్ డాక్టర్‌గా నటిస్తున్నాడు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, రామ్ పోతినేని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజా సమాచారం మేరకు ఈ ప్రాజెక్ట్‌లో నయన్ ఎంటరవబోతుందట. రజినీకి జోడీగా నయనతార నటించే అవకాశం దక్కించుకుందని, త్వరలో కమల్ బృందం అధికారికంగా ప్రకటించనున్నారని కోలీవుడ్ మీడియాలో లేటెస్ట్ న్యూస్ వైరల్ అవుతోంది.

ప్రస్తుతం నయనతార వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ నవంబర్ లో ఆమె నటించిన మూకుత్తి అమ్మన్ 2 రిలీజ్ కి రెడీ అవుతోంది. 2020లో వచ్చిన మూకుత్తి అమ్మన్ చిత్రానికి సీక్వెల్‌గా ఇది రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సీక్వెల్ మూవీని ప్రముఖ దర్శక-రచయిత సుందర్ సి తెరకెక్కిస్తున్నాడు. నయనతార మరోసారి ఈ సినిమాలో అమ్మవారి పాత్రలో కనిపించనున్నారు.

ఇప్పటికే, బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన నయన్..షారుఖ్ ఖాన్‌తో జనావ్ సినిమా చేసి భారీ హిట్ అందుకున్నారు. ఇప్పుడు, కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో చేస్తున్న సినిమా సెట్స్‌పై ఉంది. ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా, అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.

యాక్షన్, ఎమోషన్స్, కమర్షియల్ అంశాలతో రూపొందుతున్న ఈ సినిమా 2027 ఈద్ సందర్భంగా విడుదల చేయనున్నట్లు దిల్ రాజు బృందం ప్రకటించింది. సల్మాన్ ఖాన్, నయనతార కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయి. ఇవి కాకుండా మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ నయన్ లైనప్‌లో ఉన్నాయి. మరోవైపు నిర్మాతగానూ మంచి చిత్రాలను నిర్మిస్తున్నారు నయన్ జోడి.

వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి