సినిమా

Cinema: గెస్ట్ అపీరియన్స్, ఐటం సాంగ్స్ కి కోట్లు గుమ్మరిస్తే ఎలా?

రచన: Anshu••6 నిమిషాల పఠనం

Cinema: బాలీవుడ్ లో ఒకప్పుడు భారీ మల్టీస్టారర్ చిత్రాలొచ్చి బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో వసూళ్లను రాబట్టాయి. స్టార్ హీరోలను, హీరోయిన్లను హిందీ దర్శకులు ఒకే సినిమాలో ఒకే ఫ్రేమ్ లో చూపిస్తే ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్‌కి కన్నులపండుగగా అనిపించింది. ఒక్క వాల్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచి..బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్ఠించింది. ఆ ట్రెండ్ అండ్ కల్చర్ మన సౌత్‌లో మొదలై కొనసాగుతోంది. కానీ, చిన్న గెస్ట్ అపీరియన్స్‌కి కోట్లు గుమ్మరిస్తున్నారు.

Cinema: బాలీవుడ్ లో ఒకప్పుడు భారీ మల్టీస్టారర్ చిత్రాలొచ్చి బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో వసూళ్లను రాబట్టాయి. స్టార్ హీరోలను, హీరోయిన్లను హిందీ దర్శకులు ఒకే సినిమాలో ఒకే ఫ్రేమ్ లో చూపిస్తే ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్‌కి కన్నులపండుగగా అనిపించింది. ఒక్క వాల్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచి..బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్ఠించింది. ఆ ట్రెండ్ అండ్ కల్చర్ మన సౌత్‌లో మొదలై కొనసాగుతోంది. కానీ, చిన్న గెస్ట్ అపీరియన్స్‌కి కోట్లు గుమ్మరిస్తున్నారు.

మెగా హీరోలు:

తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్, శంకర్ దాదా జిందాబాద్ సినిమాలలో పవన్ కళ్యాణ్, నాగబాబు, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు ఇలా కనిపించి అలా వెళ్ళిపోయారు. కానీ, వీళ్ళెవరూ రెమ్యునరేషన్ తీసుకోలేదు. అంతెందుకు, మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేసి ఆకట్టుకున్నాడు. మరీ ఇలా వచ్చి అలా వెళ్ళేది కాదు పాత్ర. మెగాస్టార్‌తో కలిసి ఓ యాక్షన్ సీక్వెన్స్ లో , ఓ సాంగ్‌లో అలరించాడు. కానీ, చిరు మీదున్న అభిమానంతో రూపాయి రెమ్యునరేషన్ తీసుకోలేదట.

మగధీర,బ్రూస్‌లీ:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మగధీర సినిమాలో చిరు గెస్ట్ అపీరియన్స్ ఇచ్చాడు. అలాగే, బ్రూస్‌లీ లోనూ ఒక ఫైట్ సీక్వెన్స్ లో సందడి చేశాడు. కానీ, ఆయన ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు. కానీ, రజినీకాంత్ నటించిన జైలర్ మూవీలో శివ రాజ్ కుమార్ మంచి రోల్ చేసి ఆకట్టుకోగా ఆయనకి మంచి రెమ్యునరేషనే ఇచ్చారట. తాజాగా, వచ్చిన జైలర్ 2లోనూ హృతిక్ రోషన్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ కాసేపు సందడి చేశారు.

మిగతావాళ్ల సంగతి ఎలా ఉన్నా..బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ జైలర్ 2 కోసం ఏకంగా 25కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. కానీ, ఇందులో వాస్తవం లేదనేది ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. రజినీకాంత్ అంటే మన టాలీవుడ్ స్టార్స్‌కి బాలీవుడ్ స్టార్స్‌కి విపరీతమైన గౌరవం, అభిమానం. అందుకే, జైలర్ 2లో హృతిక్..జైలర్ మూవీలో ఆమిర్ ఖాన్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా కామియో చేసినట్టుగా తెలుస్తోంది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.

స్పెషల్ నంబర్ కి 3 నుంచి 4 కోట్లు:

క్రేజ్ ఉన్న హీరోయిన్ గనక సినిమాలో స్పెషల్ నంబర్‌లో సందడి చేస్తే ఎంత లేదన్నా 3 నుంచి 4 కోట్ల వరకూ ముట్టచెప్పాల్సి వస్తుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఐటెం సాంగ్ చేయాలంటే ఈ మధ్య హీరోయిన్స్ అందుకే, బాగా ఆసక్తి చూపిస్తున్నారు. తమన్నా ఈ మధ్యకాలంలో నోరా ఫతేహిని కూడా డామినేట్ చేసింది. ఏ సాంగ్ చేసినా కూడా తమన్నా తన నడుమందాలతో కుర్రాళ్ళనే కాకుండా 60 ఏళ్ళ ముసలాళ్ళని హీటెక్కిస్తుంది. తమన్నా ఐటెం సాంగ్స్‌కి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. పూజా హెగ్డే కి ఇదే రేంజ్‌లో రెమ్యునరేషన్ అందచేస్తున్నారట. ఏదేమైనా స్టార్ హీరోలు అభిమానంతో రెమ్యునరేషన్ తీసుకోకుండా కామియో చేస్తున్నప్పటికీ హీరోయిన్స్ మాత్రం ఒక్కో ఐటెం సాంగ్‌కి 3 నుంచి 4 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట.

#Mega Heros#Bollywood Heros#Kollywood Heros#Cinema News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి