సినిమా

Ajith-Hombale: హోంబలే నుంచి మరో భారీ ప్రాజెక్ట్?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Ajith-Hombale: రాకింగ్ స్టార్ యష్ హీరోగా వచ్చిన భారీ పాన్ ఇండియా సినిమా కేజీఎఫ్ ఛాప్టర్ 1. ఈ సినిమాతో నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ అంతటా బాగా పాపులర్ అయింది. ఈ సంస్థను 2012లో బెంగళూరులో విజయ్ కిరగందూర్, చలువె గౌడ ప్రారంభించారు. కాంతార కూడా ఇదే నిర్మాణ సంస్థలో వచ్చింది. అలాగే, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ యాక్షన్ సినిమా సలార్ వచ్చి వసూళ్ల సునామీని సృష్ఠించింది. ఇప్పుడు తమిళ సీనియర్ హీరో అజిత్ కుమార్‌తో హోంబలే ఓ భారీ చిత్రానికి సన్నాహాలు చేస్తోంది.

సలార్ 2:

ప్రశాంత్ నీల్, హోంబలే వాళ్ళకి మంచి అనుబంధం ఏర్పడింది. ఇప్పటికే, వీరి కాంబోలో కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, సలార్ వచ్చాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్‌టిర్ హీరోగా డ్రాగన్ సినిమాను రూపొందిస్తున్నాడు. దీని, తర్వాత మళ్ళీ ప్రభాస్ హీరోగా సలార్ సీక్వెల్ పట్టాలెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, సలార్ 2 స్టార్ట్ అవ్వాలంటే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 పూర్తవ్వాలి.

అజిత్ కుమార్‌తో క్రేజీ లైనప్?

థల అజిత్ కుమార్ హీరోగా హోంబలే ఇప్పుడు ఓ భారీ చిత్రాన్ని నిర్మించేందుకు చర్చలు జరుపుతున్నట్టుగా తాజా సమాచారం. దాదాపు, ఈ ప్రాజెక్ట్ కన్‌ఫర్మ్ అయిందని తెలుస్తోంది. త్వరలోనే, ఈ సినిమాను అధికారికంగా మేకర్స్ ప్రకటించనున్నారట. అజిత్ కుమార్‌కు కోలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా, ఇతర సౌత్ భాషలలోనూ మంచి క్రేజ్ ఉంది.

అజిత్ చేసే యాక్షన్ సినిమాలకు..ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ప్రత్యేకమైన ఆదరణ ఉంటుందనే అందరికీ తెలిసిందే. ముఖ్యంగా, మాస్ ఎలివేషన్స్, స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అజిత్ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకున్నారు. శివ, హెచ్ వినోధ్ దర్శకత్వంలో చేసిన సినిమాలు వరుసగా భారీ కమర్షియల్ సక్సెస్‌ను సాధించాయి. కాబట్టి, హోంబలేతో అజిత్ సినిమా అంటే అది ఖచ్చితంగా పాన్ ఇండియా రేంజ్‌లోనే ఉంటుంది. మరి, అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

#Thala Ajith Kumar#Hombale Filims#Kollywood#Latest Movie Updates
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి