సినిమా

Cinema: ఇక్కడ బాలయ్య-థమన్, అక్కడ రజినీ-అనిరుధ్

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Cinema: కొన్ని కాంబినేషన్స్ అలా కుదురుతాయంతే. ఆ కాంబినేషన్స్ లో వచ్చే సినిమాలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తాయి. మన తెలుగులో దర్శకుడెవరైనా, బాలయ్య హీరో.. థమన్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి. ఇక, కోలీవుడ్‌లో కూడా అంతే, సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో.. అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే బాక్సులు బద్ధలవుతున్నాయి. తాజాగా, వచ్చిన జైలర్ 2 కి థియేటర్స్ కలెక్షన్స్‌తో సందడిగా ఉంది.

ఈ అక్టోబర్ 15న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది జైలర్ 2. ఇంతకముందు వచ్చిన బ్లాక్ బస్టర్ జైలర్ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన జైలర్ 2..ముందు నుంచి అనుకున్నట్టుగానే రజినీ మేనియాతో భారీ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ పెట్టాడు. తన ఆనందాన్నంతా ఇక్కడ పంచుకున్నాడు.

సీక్వెల్ సక్సెస్ కాదన్నది ఎవరు?

సాధారణంగా మన సౌత్ సినిమాలలో సీక్వెల్స్ సక్సెస్ సాధించవని ఒక అపోహ ఉండేది. కానీ, బాహుబలి 2.. పుష్ప 2.. ఆ అపోహలను తొక్కిపెట్టాయి. ఇప్పుడు సూపర్ స్టార్ సినిమా జైలర్ 2 కూడా మరోసారి సీక్వెల్స్ కూడా సక్సెస్ సాధించడమే కాదు, కొత్త రికార్డ్స్ కూడా క్రియేట్ చేస్తాయని నిరూపించింది. జైలర్ 2 సక్సెస్‌కి ప్రధాన కారణాలు నెల్సన్ రజినీని చూపించిన విధానం..సెకండ్ హాఫ్, అనిరుధ్ అందించిన బీజీఎం. అనిరుధ్ వల్ల సినిమా నెక్స్ట్ లెవల్ కి చేరుకుంది. ఈ మ్యూజిక్ సెన్షేషన్ ఇచ్చిన బీజిఎం కి థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి.

తెలుగులో బాలకృష్ణ సినిమాలకి ఇటీవల కాలంలో థమన్ అందించిన బీజిఎం తో భారీ హిట్ సాధించడం గొప్ప విషయం. కొన్ని యాక్షన్ సీన్స్‌కి థమన్ బాదుడుకి థియేటర్స్ లో సౌండ్ బాక్సులు పగిలిపోయాయి. ఇది, ఒక్క బాలయ్య సినిమాలకి జరుగుతోంది. అక్కడేమో అనిరుధ్ రెచ్చిపోతున్నాడు. రజినీకాంత్ సినిమాలకి ఈ మధ్య అనిరుధ్ బీజిఎం అదరగొడుతున్నాడు. జైలర్ 2 ఇంత భారీ సక్సెస్ కి కారణం అనిరుధ్ అని స్వయంగా దర్శకుడు వెళ్ళడించడం హాట్ టాపిక్‌గా మారింది.

#Jailer 2#Nelson Dilip Kumar#Anirudh#Thaman#Balakrishna
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి