నేటితరం హీరోయిన్స్కి సీనియర్ హీరోలతో నటించే అవకాశం దక్కితే ఏదో అవార్డ్ వరించినట్టుగా పొంగిపోతుంటారు. ముఖ్యంగా, మన టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి, తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలలో ఛాన్స్ వస్తే జీవితంలో ఏదో సాధించినట్టే అని ఫీలవుతుంటారు. 70 ఏళ్ళు దాటిన ఈ హీరోల పక్కన హీరోయిన్ ఛాన్స్ అంటే కొంతదికి అసలు రాదు. కాబట్టి, స్పెషల్ సాంగ్ ఛాన్స్ వస్తే మత్రం అదే ఓ అవార్డ్. పూర్ణ ఇప్పుడు అదే ఆనందంలో ఉంది.
తాజాగా, భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ 2. ఈ సినిమా రిలీజైన 3 రోజుల్లోనే 315 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సంచలనం స్ట్ష్ఠించింది. కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సునామీతో దూసుకుపోతోంది. జైలర్ కంటే కూడా తాజాగా వచ్చిన సీక్వెల్ రెట్టింపు స్థాయిలో ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకుంటోంది.
అయితే, ఈ సినిమాలో నటి పూర్ణ ఓ స్పెషల్ నంబర్లో నటించింది. ఆమె పాట సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది. దీంతో, పూర్ణ ఎంతో సంతోషిస్తూ, సోషల్ మీడియాలో మేకర్స్తో పాటు దర్శకుడికి, రజినీకి, సంగీత దర్శకుడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జైలర్ లో తమన్నా పాట హైలెట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, సీక్వెల్లో పూర్ణ పాట హైలెట్గా నిలిచింది. అంతకముందు గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి సాంగ్, ఇప్పుడు జైలర్ 2లో 'అలె బోలెలో' సాంగ్ పూర్ణకి చాలా ప్రత్యేకంగా నిలిచాయి.
మెగాస్టార్తోనూ స్పెషల్ సాంగ్స్:
తెలుగులో చాలామంది హీరోయిన్గా చేయాలని ఆశపడుతుంటారు. కానీ, ఆ అవకాశం అందరికీ రాదు. ఖైదీ నంబర్ 150లో రాయ్ లక్ష్మీకి ఈ ఛాన్స్ వచ్చింది. ఆచార్య సినిమాలో రెజీనా సాంగ్ హైలెట్గా నిలిచాయి. చిరుతో స్పెషల్ సాంగ్స్ చేసిన క్రేజీ హీరోయిన్స్ ఆయనతో హీరోయిన్గా ఛాన్స్ రాకపోయినా కూడా ఐటెం సాంగ్ చేస్తే చాలని సంబరపడిపోతున్నారు. ఇక్కడ, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒక్క స్పెషల్ సాంగ్ చేస్తే వచ్చే రెమ్యునరేషన్ కూడా భారీగా అందుతుంది.


