సినిమా

King 100: నాగ్ స్టోరీ సెలక్షన్స్ మారిందా!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

King 100: టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కింగ్ నాగార్జున చేస్తున్న ప్రయోగాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎప్పుడూ తన అన్నపూర్ణ సంస్థ నుంచి కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంటాడు ఈ మన్మధుడు. కొత్త దర్శకుడంటే మొదటి సినిమాకి ప్రాణం పెట్టి పనిచేస్తాడు. హిట్ కొట్టాలనే కసి ఉంటుంది. అందుకే, డెబ్యూ డైరెక్టర్ అంటే నాగ్‌కి ఆసక్తి ఎక్కువ. అలాగే, ఇప్పుడు రా.కార్తీక్ ని మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు.

ఈ మధ్యకాలంలో నాగార్జున నుంచి సాలీడ్ మూవీ రాలేదు. బంగార్రాజు, అంతకముందు సోగ్గాడే చిన్ని నాయాన లాంటి సినిమాలతో డీసెంట్ హిట్స్ అందుకున్నాడు నాగ్. ఆ తర్వాత కుబేర, కూలీ లాంటి సినిమాలలో కీలక పాత్రల్లో నటించాడు. చెప్పాలంటే, ఇలాంటి కీలకమైన పాత్రలను ఒప్పుకోవడం ఒక సాహసం. అయితే, ఆ పాత్రలను నాగార్జునకి ఏమంతగా కలిసి రాలేదు. దాంతో, ఇకపై ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా, ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాలోనైనా గెస్ట్ రోల్ ఆఫర్ వస్తే చేయకూడదని డిసైడయ్యాడట.

అందుకే, ఇకపై హీరోగా మంచి స్టోరీస్ చేయాలనుకుంటున్నాడు మన మన్మధుడు. ఈ క్రమంలో చేస్తున్న సినిమానే కింగ్ 100. ఇది ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ మాత్రమే. ఇంకా, అసలైన టైటిల్‌ను ప్రకటించలేదు. కనీసం..ఇదే టైటిల్ అని కూడా ఇప్పటి వరకూ ఎక్కడా హింట్ కూడా ఇవ్వలేదు. అయితే, దసరా పండుగ రోజు కింగ్ 100 నుంచి సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. అదేంటన్నది..మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మేయిన్‌టైన్ చేస్తున్నారు.

చాలా ఏళ్ళ తర్వాత నాగ్‌తో టబు:

నిన్నే పెళ్ళాడతా సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో టబుకి టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఒకదశలో నాగ్-టబుల మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని ప్రచారం జరిగింది. అయితే, మళ్ళీ ఇంతకాలానికి కింగ్ 100లో మళ్ళీ టబు నటిస్తోంది. ఆమె పాత్ర ఏంటనేది ఇంకా తెలియలేదు. కానీ, ఈ పాత్రను దసరా రోజున రివీల్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఈ సినిమాను డిసెంబర్ 24న రిలీజ్ చేబోతున్నట్టుగా ప్రకటించారు. నాగ్ కెరీర్‌లోనే కింగ్ 100 ఓ మైల్ స్టోన్ మూవీగా నిలవబోతోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం కింగ్ 100కి మేజర్ ప్లస్ పాయింట్ కాబోతుంది.

#Nagarjuna#King 100#Raa.Karthik#Tabu#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి