సినిమా

Tollywood: అక్కినేని హీరోలు మరీ స్లో అయ్యారు!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Tollywood: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు బాగా స్లో అయిన హీరోలు అక్కినేని వారు. నాగార్జున మాత్రమే కాదు, నాగ చైతన్య, అఖిల్ కూడా ఈ మధ్య బాగా స్లో అయ్యారు. సినిమాల ఎంపిక మీద చాలా నెమ్మదయ్యారు. ప్రస్తుతం, మన సౌత్‌లో పాన్ ఇండియా సినిమాల హడావుడి ఎక్కువగా ఉంది. కానీ, అక్కినేని హీరోలలో మాత్రం క్రేజ్ ఉన్నా కూడా వరుస ప్రాజెక్ట్స్ చేయడానికి ఆలోచిస్తున్నారు.

Tollywood: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు బాగా స్లో అయిన హీరోలు అక్కినేని వారు. నాగార్జున మాత్రమే కాదు, నాగ చైతన్య, అఖిల్ కూడా ఈ మధ్య బాగా స్లో అయ్యారు. సినిమాల ఎంపిక మీద చాలా నెమ్మదయ్యారు. ప్రస్తుతం, మన సౌత్‌లో పాన్ ఇండియా సినిమాల హడావుడి ఎక్కువగా ఉంది. కానీ, అక్కినేని హీరోలలో మాత్రం క్రేజ్ ఉన్నా కూడా వరుస ప్రాజెక్ట్స్ చేయడానికి ఆలోచిస్తున్నారు.

'తండేల్' తర్వాత రెండేళ్ళ గ్యాప్:

అక్కినేని నాగ చైతన్య గత చిత్రం 'తండేల్'. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహించాడు. 100 కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమాతో చైతూకి సాలీడ్ హిట్ పడింది. అటు సాయి పల్లవికి, ఇటు నాగ చైతన్యకి భారీ హిట్ దక్కింది. కానీ, వెంటనే మళ్ళీ ఇద్దరూ సినిమా చేయలేకపోయారు. 'తండేల్' లాంటి భారీ హిట్ తర్వాత, కనీసం ఏడాదిలోపైనా మరో హిట్ పడి ఉంటే చైతూకి మార్కెట్ రెట్టింపు అవుతుంది. కానీ, రెండేళ్ళ నుంచి కొత్త సినిమా ఏదీ రాలేదు. వృష కర్మ చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ కాబోతోంది.

'లెనిన్' తర్వాత నో కొత్త ప్రాజెక్ట్:

అఖిల్ ఖాతాలో మొదటిసారి ఒక జెన్యూన్ హిట్ లెనిన్ సినిమాతో దక్కింది. అఖిల్ హీరోగా పరిచయమైనప్పటి నుంచి లెనిన్ మాత్రమే ఆశించిన విజయాన్నిచ్చింది. దీని, తర్వాత ఇప్పటి వరకూ అఖిల్ నుంచి కొత్త ప్రాజెక్ట్ ఏదీ ప్రకటించలేదు. బహుషా ఈ దసరా పండుగ సందర్భంగా ఈ అక్కినేని హీరో నుంచి కొత్త ప్రాజెక్ట్ ప్రకటన వస్తుందేమో చూడాలి.

కింగ్ 100 తర్వాత ఏంటీ?

నాగార్జున కూడా ఈ మధ్య బాగా స్లో అయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌ను చేస్తూ వస్తున్నారు. కానీ, నాగార్జున మాత్రం సోలో హీరోగా సినిమాలు చేసి బాగా గ్యాప్ వచ్చింది. ఇటీవల కుబేర, కూలీ సినిమాలలో కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు, కింగ్ 100 అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమాను చేస్తున్నాడు. అయితే, ఇంకా ఈ సినిమా తర్వాత నాగ్ కొత్త ప్రాజెక్ట్ ఏదీ ఇంకా ప్రకటించలేదు. 2027 లోనైనా ఈ అక్కినేని హీరోలు స్పీడ్ పెంచుతారో లేదో చూడాలి.

#Akkineni Heros#Nagarjuan#Naga Chaithanya#Akhil#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి