వైరల్ న్యూస్

HYD : కొనేరులో మునిగిన ఇన్నోవా క్రిస్టా.. వీడియో వైరల్

రచన: Kumar••3 నిమిషాల పఠనం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మహేశ్వరంలో ఘోర ప్రమాదం సంభవించింది. కారు అదుపుతప్పి ఆలయ కొనేరులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారు డోర్ తీసుకుని నీటిలోకి దూకి తన ప్రాణాలను రక్షించుకున్నాడు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మహేశ్వరంలో ఘోర ప్రమాదం సంభవించింది. కారు అదుపుతప్పి ఆలయ కొనేరులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారు డోర్ తీసుకుని నీటిలోకి దూకి తన ప్రాణాలను రక్షించుకున్నాడు.ఈ ఘటన నిన్న చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. కారు కొనేరులో పూర్తిగా మునిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో విజువల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నిన్న సాయంకాలం మహేశ్వరంలోని శివగంగ రాజరాజేశ్వర ఆలయానికి ఇన్నోవా క్రిస్టా కారు వచ్చింది.కాసేపటికే పనిపూర్తి చేసుకుని తిరిగి వెళ్తున్న క్రమంలో అతివేగంతో కారు దేవాలయ కోనేరులోకి దూసుకెళ్లింది.ఆ సమయంలో కొనేరు వద్ద ఎవరూ లేకపోవడంతో ప్రాణాప్రాయం తప్పింది. కారులోనూ డ్రైవర్ మినహా ఎవరూ లేరని సమాచారం. దీంతో పెను ప్రమాదమే తప్పింది. మెట్ల మీద నుంచి ఒక్కసారిగా కారు నీటిలోనికి వెళ్లడంతో భయపడిపోయిన డ్రైవర్ వెంటనే అందులో నుంచి దిగి ప్రాణాలు కాపాడుతున్నాడు.

అనంతరం నెమ్మదిగా కారు మొత్తం నీటిలో మునిగిపోయింది. ఈ దృశ్యాన్ని స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అవుతోంది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. కారును కొలనులో నుంచి బయటకు తీసేందుకు ఆలయ అధికారులు, పోలీసులు సంయుక్తంగా కృషి చేశారు. వెలికితీత పనులు సైతం పూర్తయినట్టు సమాచారం.

#temple pond#innova crysta#jumped#drown#maheshwaram#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి