తెలంగాణ

Trees: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి- జోగినపల్లి సంతోష్

రచన: NK•••5 నిమిషాల పఠనం

హనుమకొండలోని పద్మాక్షి గుట్ట వద్ద గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, వన సేవ సొసైటీ వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యుడు దాస్యం వినయ్ భాస్కర్, శాసనమండలి సభ్యుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.

* పద్మాక్షి గుట్టలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌

* మొక్కలు నాటిన ప్రముఖులు

* పచ్చదనంతోనే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవితం అని సందేశం

Trees: హనుమకొండలోని పద్మాక్షి గుట్ట వద్ద గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, వన సేవ సొసైటీ వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యుడు దాస్యం వినయ్ భాస్కర్, శాసనమండలి సభ్యుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.

ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత, పచ్చదనం పెంపొందించడం వంటి అంశాలపై ప్రాధాన్యతను నాయకులు చాటి చెప్పారు. నేటి కాలంలో పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు, పచ్చని చెట్ల నరికివేత వంటి సమస్యలను అధిగమించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటడమే కాకుండా, వాటిని సంరక్షించే బాధ్యతను కూడా స్వీకరించాలని పిలుపునిచ్చారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌తో పర్యావరణ పరిరక్షణకు నూతన స్ఫూర్తి

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాలకు ప్రోత్సాహం అందిస్తూ పచ్చదనం పెంపొందించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని నాయకులు అన్నారు. మొక్కలు నాటడం కేవలం ఒక కార్యక్రమంగా మిగిలిపోకుండా, వాటిని పెంచి పెద్దవి చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని చెప్పారు.

పద్మాక్షి గుట్ట వంటి చారిత్రక, ప్రకృతి సౌందర్యం కలిగిన ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రకృతి అందాలను కాపాడుకోవచ్చన్నారు. ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు. యువత, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, వన సేవ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం.. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, హరిత తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలనే సందేశాన్ని అందించింది. మొక్క నాటుదాం-చెట్టుగా పెంచుదాం-పర్యావరణాన్ని కాపాడుదాం.. హరిత తెలంగాణే లక్ష్యం.. పచ్చని భవిష్యత్తే మన సంకల్పం.. అనే నినాదం ఇచ్చారు.

'గ్రీన్ ఇండియా ఛాలెంజ్'లో భాగంగా హనుమకొండలోని పద్మాక్షి గుట్ట వద్ద 'ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ', 'వన సేవా సొసైటీ' ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కల నాటే కార్యక్రమాన్ని చూడటం సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నా అభినందనలు. మొక్కలు నాటడం అనేది కేవలం ఆరంభం మాత్రమే. వాటిని సంరక్షించి పెద్ద వృక్షాలుగా తీర్చిదిద్దడం మనందరి సామూహిక బాధ్యత. ప్రకృతిని కాపాడుకుందాం, జీవవైవిధ్యాన్ని పరిరక్షించుకుందాం, భావి తరాల కోసం మరింత పచ్చని తెలంగాణను నిర్మించుకుందాం' అని జోగినపల్లి సంతోష్ పిలుపునిచ్చారు.

#Orugallu Wildlife Society#Plantation Drive#Padmakshi Gutta#Hanamkonda#Vana Seva Society#Green India Challenge#Joginapally Santosh Kumar#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి