బస్సులో మర్చిపోయిన నగదును ప్రయాణికుడికి అందజేసి ఓ మహిళా కండక్టర్ తన నిజాయితీని చాటుకుంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆమె నిజాయితీ పట్ల పలువురు ప్రశంసిస్తున్నారు.సాధారణంగా ఏదైనా వస్తువును ప్రయాణికులు మర్చిపోతే వాటిని మర్చిపోవాల్సిందే.ఎందుకంటే తిరిగి వెళ్లేసరికి అక్కడ ఆ వస్తువు ఉండదు.తోటి ప్రయాణికులు సైతం దానిని తీసుకోనిపోవచ్చు. డబ్బులు, నగదు ఉంటే మరల దొరుకుతాయనే ఆశ కూడా ఉండదు. వాటిని చూస్తే ఎవరికైనా అత్యాశ కలుగక మానదు.
కానీ, ఆర్టీసీ సిబ్బంది మాత్రం అలా చేయలేదు.నిజాయితీగా ప్రయాణికుడు మర్చిపోయిన పార్సిల్‌ను సేఫ్‌గా వారికి అందజేశారు. వివరాల్లోకివెళితే.. షాద్‌నగర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త జహంగీర్ తన భార్యతో కలిసి హజ్ యాత్రకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటూ శనివారం హైదరాబాద్ వెళ్తున్నారు.ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులో అనుకోకుండా రూ.3 లక్షల నగదును మర్చిపోయాడు.అఫ్జల్‌గంజ్ వద్ద బస్సు దిగిన తర్వాత జహంగీర్ నాంపల్లికి బయలుదేరారు.
అయితే రూ. 3 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను బస్సులోనే మరిచిపోయినట్లు గుర్తించిన జహంగీర్.. కొద్దిసేపటికే హుటాహుటిన బస్టాండ్‌కు చేరుకున్నాడు.ఈ క్రమంలోనే ఆర్టీసీ కండక్టర్ సరిత ఆ బ్యాగ్‌ను గమనించి వెంటనే డ్రైవర్ నరసింహులును అప్రమత్తం చేశారు. వారు ఆ నగదును భద్రపరిచి, ప్రయాణికుడు తిరిగి వస్తాడని వేచి చూశారు. తీరా ప్యాసింజర్ వచ్చాక రూ. 3 లక్షల పూర్తి మొత్తాన్ని కండక్టర్ సరిత, డ్రైవర్ నరసింహులు అతనికి అందజేశారు. దీంతో ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ పట్ల ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.
సరిత నిజాయితీ, అంకితభావాన్ని గుర్తించిన తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమెను ప్రశంసించారు.ఈ ఘటన ఆర్టీసీ ఉద్యోగుల నిజాయితీకి, బాధ్యతాయుత ప్రవర్తనకు నిదర్శనంగా నిలిచిందని పేర్కొన్నారు.












