తెలంగాణ

BRS : తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ నేతలు.. రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు

రచన: Kumar5 నిమిషాల పఠనం

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్లదుస్తులు ధరించి రావడంపై పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ శాసనసభ్యులను లోనికి అనుమతించబోమని స్పష్టంచేశారు.

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్లదుస్తులు ధరించి రావడంపై పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ శాసనసభ్యులను లోనికి అనుమతించబోమని స్పష్టంచేశారు. ప్లకార్డులు వదిలేసి, నల్లదుస్తులు తీసేసి రావాలని చెప్పడంతో శాసనసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఎవరు మమ్మల్ని అడ్డుకోవడానికి అని మండిపడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాగ్వాదానికి దిగారు.

https://x.com/TeluguScribe/status/2096836972702728548?s=20

అసెంబ్లీ వద్ద నిరసన చేపట్టడానికి ప్రయత్నించడంతో కేటీఆర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు తోటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ‘అసెంబ్లీకి రండి అంటారు.. మళ్లీ అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ వాళ్లు భయపడుతున్నారు’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇష్టం వచ్చినట్లు చేతులు పట్టుకొని లాగారని, కింద పడేసి తొక్కారని.. వారిపై కచ్చితంగా ఫిర్యాదు చేస్తామని, వారి మీద చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు.

కాగా,అరెస్టు అయిన నేతలు పోలీస్ స్టేషన్‌ల నుంచి తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అంతా అక్కడ భేటీ అయ్యారు. తోపులాటలో భాగంగా కేటీఆర్,హరీశ్ రావుకు స్వల్ప గాయాలు అయినట్టు సమాచారం.వారికి వైద్యులు చికిత్స అందించినట్టు సమాచారం.

https://x.com/TeluguScribe/status/2096829738203615370?s=20

మహిళల చీరలు లాగుతారా?

అసెంబ్లీ వద్ద నెలకొన్నఉద్రిక్తతలో మహిళలను చూడకుండా చీరలు లాగడం ఏంటి? ఎమ్మెల్యేలను కొట్టడం ఏంటి? అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. రాక్షస రాజ్యంలో పేరు మాత్రం ప్రజా పాలన అని పెట్టారని ఫైర్ అయ్యారు. ‘మా శాసనసభ్యులు అసెంబ్లీలోకి పోవొద్దా.. ఏంటీ దౌర్జన్యం’ అంటూ పోలీసుల తీరుపై మండిపడ్డారు.

రాష్ట్రవ్యాప్తంగా నిరసలనకు పిలుపు..

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అసెంబ్లీకి రాకుండా ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. పార్టీ నాయకులు ఎక్కడిక్కడ నిరసన వ్యక్తం చేయాలని కోరింది. దీంతో సూర్యాపేట నేషనల్ హైవేపై గులాబీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. అసెంబ్లీకి పోనీయకుండా ఎమ్మెల్యేను అడ్డుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హైవేను దిగ్బంధించారు. దీంతో సూర్యాపేట అంజనాపురి చౌరస్తా నేషనల్ హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్వల్పంగా గాయపడటంతో ఆయన అనుచరులు, అభిమానులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

https://x.com/TeluguScribe/status/2096829357444776373?s=20

#BRS#KTR#Harish rao#assembly#politics#arrests#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి