తెలంగాణ

BRS : తోపులాటలో కిందపడిపోయిన జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ కాలికి గాయం

రచన: Kumar4 నిమిషాల పఠనం

అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్లదుస్తులు ధరించి రావడంపై పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ శాసనసభ్యులను లోనికి అనుమతించబోమని స్పష్టంచేశారు.

అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్లదుస్తులు ధరించి రావడంపై పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ శాసనసభ్యులను లోనికి అనుమతించబోమని స్పష్టంచేశారు. ప్లకార్డులు వదిలేసి, నల్లదుస్తులు తీసేసి రావాలని చెప్పడంతో శాసనసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఎవరు మమ్మల్ని అడ్డుకోవడానికి అని మండిపడ్డారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆదేశాలు ఏమైనా ఉంటే చూపించాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసెడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. పోలీసులు డ్యూటీ మాత్రమే చేయాలని, అతి చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు.రెండేండ్ల తర్వాత తమ ప్రభుత్వ్ం వస్తుందని అప్పుడు అందరికీ సమాధానం ఇస్తామని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇదిలాఉండగా, అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ సభ్యులను పోలీసులు అడ్డుకోగా.. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

కాసేపు అక్కడ తోపులాట నెలకొనడంతో బీఆర్ఎస్ సభ్యులు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కిందపడిపోయారు.ఆ గుంపులో నుంచి ఆయన్ను తోటి ఎమ్మెల్యేలు బయటకు తీసుకుని రావడంతో ఊపిరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగదీశ్ రెడ్డి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్టు అందులో స్పష్టంగా కనిపిస్తోంది.

https://x.com/TeluguScribe/status/2096818239942885799?s=20

ఇదే ఘటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి కాలికి గాయమైనట్టు తెలుస్తోంది.బొటన వేలికి రక్తం వస్తున్న దృశ్యం కనిపించింది. నల్ల దుస్తులు ధరించి నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల పోలీసులు కర్కశంగా వ్యవహరించినట్టు సమాచారం.అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు వారిని అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. కాగా, అసెంబ్లీలోకి బీఆర్ఎస్ సభ్యులను అనుమతించకపోవడంతో నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు గులాబీ అధినాయకత్వం పిలుపునిచ్చింది.

#mla jagadish reddy#mlc yadav reddy#politics#injured#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి