Epic Movie: ఒకే ఫ్యామిలీలో ఇద్దరు హీరోలుంటే..వాళ్ళే చాలు ఒకరి సినిమాను ఇంకొకరు ప్రమోట్ చేయడానికి. ఇప్పుడు దేవరకొండ ఫ్యామిలీలోనూ అదే జరుగుతోంది. టాలీవుడ్ లో రౌడీ హీరోగా పాపులారిటీని సంపాదించుకున్న విజయ్ దేవరకొండ..తన సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన ఎపిక్ సినిమా ప్రీలీజ్ ఈవెంట్‌కి రాబోతున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 11న రిలీజ్ కాబోతోంది.
యువ దర్శకుడు ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా ఎపిక్. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌తో రిలీజ్ కు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో, ఇదే ఉత్సాహాన్ని మరింతగా పెంచుతూ, సెప్టెంబర్ 8వ తేదీన విజయవాడలో గ్రాండ్ గా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించనున్నారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా, ఆనంద్ అన్న విజయ్ దేవరకొండ హాజరవబోతున్నట్టుగా సమాచారం.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా రూపొందిన ఈ సినిమా మెజారిటీ భాగం లండ్‌లో షూట్ చేశారు. ఇదొక రోమ్ కామ్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. బేబి చిత్రం తర్వాత మళ్ళీ ఆనంద్ అండ్ వైష్ణవి కలిసి నటించిన ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే, ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్‌కి విజయ్ దేవరకొండ భార్య, ఆనంద్ వదిన, నేషనల్ క్రష్..స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న వచ్చి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన స్పీచ్ బాగా వైరల్ అయింది.
అలాగే, విజయవాడలో జరగబోయో ఈవెంట్‌కి విజయ్ రాబోతున్నాడట. త్వరలో, దీనికి, సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోంది. మరి, ఈ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ఎంతవరకూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో..ఆనంద్, వైష్ణవిలకి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి. బేబీ తర్వాత వీరిద్దరికీ మళ్ళీ ఇప్పటి వరకూ ఆశించిన సక్సెస్ రాలేదు. ఎపిక్ మూవీతో ఆ గ్యాప్ ని ఫిల్ చేయాలనుకుంటున్న వారి ఆకాంక్ష నెవరుతుందో లేదో మరి.












