తెలంగాణ

BRS : అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత..ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర లాగిన పోలీసులు

రచన: Kumar4 నిమిషాల పఠనం

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలని నిరసిస్తూ గన్‌పార్క్ వద్ద ప్లకార్డులు ప్రదర్శించి అసెంబ్లీకి పాదయాత్ర చేస్తూ వచ్చిన బీఆర్ఎస్ శాసన సభ్యులను పోలీసుల అడ్డుకున్నారు.

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలని నిరసిస్తూ గన్‌పార్క్ వద్ద ప్లకార్డులు ప్రదర్శించి అసెంబ్లీకి పాదయాత్ర చేస్తూ వచ్చిన బీఆర్ఎస్ శాసన సభ్యులను పోలీసుల అడ్డుకున్నారు. వారిని లోనికి వెళ్లేందుకు అనుమతించలేదు. నల్లదుస్తులు ధరించి రాకూడదని చెప్పడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

ఈ క్రమంలోనే అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ శాసనసభ సభ్యులను పోలీసులు అడ్డుకోవడానికి యత్నించారు. ఈ క్రమంలోనే ఓ పోలీసు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దౌర్జన్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు.

1000 రోజుల కాంగ్రెస్ విఫల పాలనకు వ్యతిరేకంగా గన్‌పార్క్ నుంచి అసెంబ్లీకి నిరసనగా వెళ్తున్న ఎమ్మెల్యేల పట్ల పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించినట్టు తెలిసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పట్ల అవమానకరంగా ప్రవర్తించి, చీర పట్టుకుని పోలీసులు లాగడంతో అక్కడంతా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యేలు అని కూడా చూడకుండా ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా? అంటూ సునీతా లక్ష్మారెడ్డి కంటనీరు పెట్టుకున్నారు. పక్కనే ఉన్న మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి.. సునీత్మకు అండగా నిలిచారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

https://x.com/TeluguScribe/status/2096817017970135510?s=20

నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వెళ్తే తప్పేంటి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ప్రాంగణం ఎదుట గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.నల్ల దుస్తులు లేకుండా వెళ్లాలని పోలీసులు ఎమ్మెల్యేలను వారిస్తున్నట్టు సమాచారం. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ నేతలు అక్కడే ఆందోళన చేపట్టారు.వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి స్టేషన్‌కు తరలిస్తున్నట్టు సమాచారం.మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు లేకుండా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయినట్టు తెలిసింది.

https://x.com/TeluguScribe/status/2096818563562803424?s=20

#BRS#assembly sessions#black dress code#police stopped#mla sunitha laxmareddy#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి