సినిమా

NTR - Dragon: ఎన్టీఆర్-నీల్ సినిమాపై ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్!

రచన: Anshu4 నిమిషాల పఠనం

NTR - Dragon: మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) సినిమాకి సంబందించి ఇటీవల వస్తోన్న రూమర్స్ అన్నిటికీ నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఎన్టీఆర్ కి గాయం కావడం మూలంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. దీంతో, ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ కాదని వార్తలు ప్రచారం కాగా, దీనిపై మేకర్స్ సాలీడ్ అప్‌డేట్ ఇచ్చారు. చెప్పిన తేదీకే డ్రాగన్ రిలీజ్ అని కన్‌ఫర్మ్ చేశారు.

దేవర తర్వాత ఎన్టీఆర్ చేస్తోన్న సాలీడ్ యాక్షన్ సినిమా డ్రాగన్. కేజీఎఫ్ సిరీస్, సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న సినిమా కూడా ఇదే. కాబట్టి, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోకి ముందు నుంచి నందమూరి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో, సినీ వర్గాలలో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు, ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ లుక్ వచ్చాక మరీ పీక్స్ కి చేరుకున్నాయి.

అయితే, వాస్తవానికి, ఈ సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకోవాల్సి ఉండగా, ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో బ్రేక్ పడింది. దీంతో, ప్రశాంత్ నీల్ కూడా సలార్ 2 స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమైయ్యాడని..ఇక, డ్రాగన్ షూట్ ఇప్పుడే మొదలవదని మాట్లాడుకున్నారు. మరీ, ముఖ్యంగా ప్రశాంత్ నీల్, రాజమౌళి లాగా ఒక్కో సీన్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటాడనే టాక్ ఉంది. కాబట్టి, ఎప్పుడు షూట్ కంప్లీట్ అవుతుందో..ఎప్పుడు రిలీజ్ డేట్ ని కన్‌ఫర్మ్ చేస్తారో అని పలు రకాల వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ డ్రాగన్ సినిమాపై సాలీడ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ నెల రెండవ వారంలోపు మళ్ళీ రీస్టార్ట్ అవుతుందని వెల్లడించారు. అంతేకాదు, 2027 ఫిబ్రవరికల్లా మొత్తం షూటింగ్ పూర్తి చేయనున్నట్టు తెలిపిన మేకర్స్, ముందు చెప్పినట్టుగానే జూన్ లో అనుకున్న తేదీకే వస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. దీనితో, ఇన్నాళ్ళు ఎన్టీఆర్-నీల్ సినిమాపై వచ్చినవన్నీ రూమర్స్ అని తేలిపోయింది.

#NTR#Dragon#Prashanth Neel#Rukmini Vasanth#Mythri Movie Makers
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి