I Am Game: తెలుగులో బాగా క్రేజ్ ఉన్న మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. మమ్ముట్టి తనయుడిగా మలయాళ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ, ఆ తర్వాత సోలో హీరోగా అక్కడ మంచి మార్కెట్‌ని సంపాదించుకున్నాడు. ఇక, దుల్కర్ నటించిన లేటేస్ట్ సినిమా ఐ యామ్ గేమ్. ఈ రోజు ప్రేక్షకుల ముదుకు రావాల్సిన ఈ మూవీ తెలుగులో మార్నింగ్ షోస్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. దీనికి, కారణం కంటెంట్ అప్‌లోడ్ అవలేదని తెలుస్తోంది.
'మహానటి' సినిమాతో జెనిమీ గణేష్ పాత్రలో నటించి ఇక్కడ బాగా పాపులర్ అయ్యాడు. అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ఇది తెరకెక్కింది. కీర్తి సురేష్ మహానటి పాత్రలో జీవించింది అని చెప్పాలి. ఆమె భర్త జెమినీ గణేష్ పాత్రలో జీవితకాలం గుర్తుండిపోయేలా ఒదిగిపోయాడు దుల్కర్ సల్మాన్. కీర్తి, దుల్కర్ ల ఆన్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ ప్రతీ ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంది.
ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో స్ట్రైట్ సినిమాలను చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్‌పై అశ్వినీదత్, స్వప్నాదత్ నిర్మించిన 'సీతా రామం'తో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో విడుదలై భారీ విజయన్ని అందుకుంది. ఆ తర్వాత 'లక్కీ భాస్కర్' సినిమా కూడా తెలుగు స్ట్రైట్ సినిమాగా వచ్చింది. ఈ రెండు సినిమాలతో మన టాలీవుడ్ మార్కెట్‌ను బాగా పెంచుకున్నాడు.
దాంతో, నహాస్ హైదత్ తెరకెక్కించిన థ్రిల్లర్ సినిమా ఐ యామ్ గేమ్ సినిమా విడుదలవుతుంటే మన తెలుగు ఆడియన్స్ లో మంచి అంచనాలున్నాయి. కానీ, ఊహించని విధంగా టెక్నికల్ ఇష్యూస్ తో తెలుగు వెర్షన్ మార్నింగ్ షోస్ రద్దయ్యాయి. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా కన్‌ఫర్మ్ చేశారు. బహుషా మధ్యాహ్నం షోస్ పడే అవకాశం ఉంది. చూడాలి, మరి, దుల్కర్ నుంచి వస్తోన్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో.









