తెలంగాణ

జాతీయ పార్టీలు తెలంగాణను ముంచుతున్నాయి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ధ్వజం!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు కలిసి నాశనం చేస్తున్నాయని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలోని పెద్దన్న, ఇక్కడ రాష్ట్రంలోని చిన్నన్న ఇద్దరూ చేతులు కలిపి తెలంగాణ ప్రయోజనాలను పూర్తిగా ముంచుతున్నారని ఆయన ఆరోపించారు.

 ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు కలిసి నాశనం చేస్తున్నాయని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలోని పెద్దన్న, ఇక్కడ రాష్ట్రంలోని చిన్నన్న ఇద్దరూ చేతులు కలిపి తెలంగాణ ప్రయోజనాలను పూర్తిగా ముంచుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రాన్ని పాలించడంలో, ప్రజల సమస్యలు తీర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు.

 రైతాంగ సమస్యలు, దెబ్బతిన్న పంటల గురించి పార్లమెంట్‌లో మాట్లాడాలని డిమాండ్ చేస్తే, బీజేపీ ఎంపీలు భిక్షాటన లంకెతో పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నారని కల్వకుంట్ల సంజయ్ ఎద్దేవా చేశారు. ‘జుట్టు గురించి, అనవసర వివాదాల గురించి మాట్లాడడానికేనా మిమ్మల్ని ప్రజలు ఎంపీగా గెలిపించింది?’ అని ఆయన ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ఒక కేంద్ర మంత్రి, ఒక ఎంపీ మాట్లాడాల్సిన మాటలు ఇవేనా అంటూ బీజేపీ నేతల వైఖరిని అసెంబ్లీ వేదికగా, విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు.

 మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలు, గ్లోబల్ సమ్మిట్లంటూ హంగామా చేస్తున్నారని, కానీ ఇక్కడ రాష్ట్రంలో పారిశ్రామిక అనుమతుల కీలక పోర్టల్ టీజీ-ఐపాస్ (TG-iPASS) హ్యాక్ అయిందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్‌లో ఏఐ (AI) గురించి ఉపన్యాసాలు ఇస్తుంటే, ఇక్కడ ప్రభుత్వ వెబ్‌సైట్లు, సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలు దారుణంగా కుప్పకూలిపోతున్నాయని విమర్శించారు. ‘రేవంత్ రెడ్డి గారూ.. అనుముల ఇంటెలిజెన్స్ కాదు, తెలంగాణ ఇంటెలిజెన్స్ సమర్థతను ఉపయోగించండి’ అని చురకలంటించారు.

 ప్రజా సమస్యలపై ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ప్రశ్నిస్తే, దానికి బాధ్యతాయుతమైన సమాధానం చెప్పాల్సిన అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు రివర్స్‌లో ధర్నాలకు దిగుతున్నారని, ఇది దేశ రాజకీయాల్లోనే ఒక పెద్ద జోక్‌గా మారిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్, బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయని డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మండిపడ్డారు.

 

#BRSMlakalvakuntlaSanjay#TelanganaPolitics2026#TGiPASSHacked#CongressVsBRS#TelanganaNewsTelugu#RevanthReddyGovt#BRSNewsTelugu#HyderabadNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి