సినిమా

Music Directors: మ్యూజిక్ డైరెక్టర్స్‌కి లైఫ్ లేదా?

రచన: Anshu••5 నిమిషాల పఠనం

Music Directors: ఒకప్పటితో పోల్చుకుంటే గత పదేళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకులెక్కువైపోయారు. వారిలో వేళ్ళపైన లెక్కపెట్టేవాళ్ళే కంటిన్యూస్‌గా సినిమాలు చేస్తున్నారు తప్ప..కొందరైతే రెండు మూడేళ్ళకి మించి కొనసాగలేకపోతున్నారు. దీనికి, పలు రకాల కారణాలున్నాయి. ఆస్కార్ అవార్డ్ అందుకున్న ఏ.ఆర్.రెహమాన్ కూడా గతకొంతకాలంగా తమిళంలో చాలా స్లో అయ్యాడు. తెలుగులో మెలోడి బ్రహ్మగా పేరొందిన మణిశర్మ కూడా అంతే.

Music Directors: ఒకప్పటితో పోల్చుకుంటే గత పదేళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకులెక్కువైపోయారు. వారిలో వేళ్ళపైన లెక్కపెట్టేవాళ్ళే కంటిన్యూస్‌గా సినిమాలు చేస్తున్నారు తప్ప..కొందరైతే రెండు మూడేళ్ళకి మించి కొనసాగలేకపోతున్నారు. దీనికి, పలు రకాల కారణాలున్నాయి. ఆస్కార్ అవార్డ్ అందుకున్న ఏ.ఆర్.రెహమాన్ కూడా గతకొంతకాలంగా తమిళంలో చాలా స్లో అయ్యాడు. తెలుగులో మెలోడి బ్రహ్మగా పేరొందిన మణిశర్మ కూడా అంతే.

రాక్‌స్టార్‌గా సంచలనం సృష్ఠించిన డీఎస్పీ:

దేవి సినిమాతో సంగీత దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్. తెలుగులో ఎక్కువ సినిమాలు చేసిన దేవి, తమిళంలోనూ చాలాఏళ్ళు బిజీగా ఉన్నాడు. తెలుగు-తమిళ భాషలలో డీఎస్పీ మ్యూజిక్ అందించిన సినిమాలలో మెజారిటీ భాగం బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. హీరోలతో పాటలు పాడించాలన్నా, డాన్సులు చేయించాలన్నా డీఎస్పీ తర్వాతే ఎవరైనా. అలాంటి, దేవిశ్రీప్రసాద్ ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయలేకపోతున్నాడు.

థమన్‌కి క్రేజ్ ఎక్కువైంది:

బాయ్స్ సినిమాలో డ్రమ్మర్‌గా కనిపించిన ఎస్.ఎస్.థమన్.. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్‌గా మారి.. మిరపకాయ్, దూకుడు, కిక్ లాంటి సినిమాలతో బిజీ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారాడు. బాలయ్య సినిమా అంటే థమన్‌కు పూనకాలొచ్చేస్తాయి. అఖండ నుంచి ఇప్పుడు చేస్తున్న దాదా వరకూ బాలయ్య నటించిన అన్నీ సినిమాలకి సంగీతం అందించింది థమన్. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలతో పాటు దాదాపు మన టాలీవుడ్ స్టార్స్, కోలీవుడ్ స్టార్స్ నటించిన సినిమాలకి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. కానీ, ఎక్కడో ఒకచోట కాపీ క్యాట్ అనే కామెంట్స్ థమన్ విషయంలో వినిపిస్తూనే ఉన్నాయి.

ఒకప్పుడు, తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నిటికీ ఆర్పీ పట్నాయక్ సంగీత దర్శకుడు. కానీ, ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ రావడం వల్ల ఆర్పీ పక్కకి వచ్చాడు. క్రమంగా, అవకాశాలు కూడా తగ్గిపోయాయి. చక్రీ ఉన్నంతకాలం అద్భుతమైన మ్యూజిక్ తో ఆకట్టుకున్నాడు. ఇక.. అప్పటికీ, ఇప్పటికీ ఎం.ఎం.కీరవాణి దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి ఆస్తాన సంగీద దర్శకుడు. ఈ మధ్య ఆయన కూడా తక్కువ సినిమాలనే చేస్తున్నాడు. క్షణం తీరిక లేకుండా గడిపిన మణిశర్మ కూడా ప్రస్తుతం నాకు ఒక సినిమా ఇవ్వండీ..అని ఎదురుచూసే పరిస్థితుల్లో ఉన్నాడు.

సాయి కార్తీక్, ఒకదశలో మంచి సినిమాలను చేసి సూపర్ హిట్ ఆల్బంస్ ఇచ్చాడు. కానీ, ఇప్పుడు ఆయన ఖాతాలో కూడా సినిమాలు అంతగా లేవు. అనూప్ రుబెన్స్ కూడా రాకెట్‌లా అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు. ప్రస్తుతం, కోలీవుడ్‌లో అనిరుధ్ బాగా బిజీగా ఉన్నాడు. తెలుగులోనూ వరుసగా క్రేజీ మూవీస్ చేస్తున్నాడు అనిరుధ్. కేజీఎఫ్ తో రవి బ్రసూర్ బిజీగా ఉన్నాడు. హీరోగా, సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాష్ కుమార్ చాలా బిజీగా ఉన్నాడు. కానీ, ఏ సంగీత దర్శకుడు కూడా ఇండస్ట్రీలో ఎక్కువకాలం కొనసాగలేకపోతున్నాడు.

#A.R.Rehaman#Manisharma#Devi Sri Prasad#GV Prakash Kumar#M.M.Keeravani
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి