Tollywood: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో దరకుడిగా శేఖర్ కమ్ముల మేకింగ్ స్టైల్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అందరూ, కమర్షియల్ సినిమా అంటూ యాక్షన్, ఫ్యాక్షన్ సినిమాలను, పీరియాడిక్, మైథలాజికల్, బయోపిక్స్ ..ఇలా హెవీ జానర్స్‌లో సినిమాలను చేయాలని ఆరాటపడుతుంటారు. కానీ, శేఖర్ కమ్ముల మాత్రం చాలా సహజమైన కథలను చెప్పడానికే ఆసక్తి చూపిస్తుంటాడు. అంతేకాదు, ఎప్పుడు కూడా 100, 200 కోట్ల బడ్జెట్ సినిమా తీయాలని ట్రై చేయలేదు.
డాలర్ డ్రీమ్స్:
శేఖర్ కమ్ముల మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్. ఈ సినిమా యువత కలలకి అద్దం పట్టేలా ఉంటుంది. చాలా తక్కువ బడ్జెట్‌తో రూపొంచాడు. అవార్డ్ కూడా దక్కించుకున్న డాలర్ డ్రీమ్స్..అసలు శేఖర్ కమ్ముల నుంచి ఒక సినిమా వచ్చిందని కూడా చాలామందికి తెలియదు. ఆ తర్వాత వచ్చిన ఆనంద్ ఒకే ఒక్క థియోటర్స్‌లో రిలీజై ..కేవలం మౌత్ టాక్‌తోనే భారీ హిట్ సాధించింది. ఈ సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి చాలామంది స్టార్స్ కోసం తిరిగి చివరికి రాజాతో తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు.
ఆనంద్ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల పేరు టాలీవుడ్లో బాగా వినిపించింది. దీని, తర్వాత సుమంత్ హీరోగా గోదావరి సినిమాను తీసి హిట్ అందుకున్నాడు. ఈ రెండిట్లోనూ హీరోయిన్గా కమిలినీ ముఖర్జీ నటించింది. ఆనంద్, గోదావరి సినిమాలకి పూర్తి భిన్నంగా తీసిన సినిమా కాలేజ్ లవ్ స్టోరీ హ్యాపీడేస్. దాదాపు సినిమా అంతా ఆయన చదువుకున్న గండిపేట్ సీబీఐటీలోనే తీశాడు. ఈ సినిమాతో చాలామందికి లైఫ్ ఇచ్చాడు శేఖర్ కమ్ముల.
ఆ తర్వాత రానాను పరిచయం చేస్తూ లీడర్, సాయి పల్లవిని పరిచయం చేస్తూ ఫిదా లాంటి సినిమాల్ను తీశాడు. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నలతో తీసిన పాన్ ఇండియా సినిమా కుబేర మంచి కమర్షియల్ సక్సెస్‌ను సాధించింది. మొత్తం ఇప్పటి వరకూ 6 నంది అవారులను అందుకున్న శేఖ కమ్ముల చాలా సింపుల్‌గా ఉంటాడు. అంతేకాదు, ఆయనకి బాగా సెంటిమెంట్..పద్మారావు నగర్లో ఒక్క సీన్ అయినా షూట్ చేయడం. ప్రతీ సినిమాకి ఈ సెంటిమెంట్ ఉంటుంది. ఇక, అన్నిటికంటే ముఖ్యమన విషయం..ఎంత పెద్ద స్టార్ అయినా..షూటింగ్ కి ముందు శేఖర్ కమ్ముల ఆఫీసులో 40 నుంచి 45..50 రోజుల పాటు పూర్తిగా స్క్రిప్ట్ చదువుకుంటూ క్యారెక్టర్ అలాటు చేసుకునేలా ఆడిషన్..ప్రాక్టీస్ చేయాల్సిందే.


