Nag-Chiru: మన సీనియర్ స్టార్ హీరోలు కూడా ఇప్పుడు కలిసి మల్టీస్టారర్ సినిమాను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో మన స్టార్స్ ఇద్దరు కలిసి నటించిన సినిమాలు ఒకేరోజు బక్సాఫీస్ వద్ద రిలీజైతే గొడవలు, కొట్లాటలు జరిగేవి. మా హీరో గొప్ప, మా హీరో గొప్ప అని.. నానా రచ్చా చేసేవాళ్ళు. కానీ, ఇప్పుడు అలాంటి వాటికి స్థానం లేదు. అందుకే, సీనియర్స్ కూడా కలిసి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. తాజాగా, నాగ్ కూడా చిరుతో సినిమా చేయడానికి రెడీ అని క్లారిటీ ఇచ్చాడు.
అనిల్ రావిపూడి రెడీగా ఉన్నాడా!
క్రేజీ మల్టీస్టారర్ సినిమా చేయాలంటే ఇప్పుడున్న దర్శకుల్లో హిట్ మిషన్ అనిల్ రావిపూడి వల్లే అవుతుంది. రాజమౌళి అంటే అది గ్లోబల్ సినిమా అవుతుంది కాబట్టి, ఇది అంత త్వరగా వర్కౌట్ కాకపోవచ్చు. అనిల్ గత చిత్రం మన శంకరవరప్రసాద్గారులో వెంకీ కూడా కీలక పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. అయితే, అనిల్ ఇద్దరు సీనియర్స్ను ఎలా డీల్ చేస్తాడో.! అని కాస్త అభిమానుల్లో సందేహాలుండేవి. కానీ, సినిమా రిలీజయ్యాక ఇద్దరు హీరోల అభిమానులు హ్యాపీ. సినిమా 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
అనిల్ రావిపూడి చేయాల్సింది ఇప్పుడు, ఒక్క నాగార్జునతోనే. నెక్స్ట్ సినిమాను ఆయనతోనే చేసే ప్లాన్స్ ఉన్నాయి. అంతేకాదు, ఈ సినిమాలో మెగాస్టార్ కూడా నటించే విధంగా స్క్రిప్ట్ తయారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ ఇద్దరి కోసం కథ చేస్తానని అనిల్ చెప్పాడు. దాదాపు, మెగాస్టార్-నాగార్జున కలిసి చేసే సినిమా అనిల్ చేతిలోనే ఉందనిపిస్తోంది. ఇటీవల, నాగార్జున కూడా కథ కోసం ఎదురుచూస్తున్నామని..ఖచ్చితంగా ఇది జరుగుతుందని క్లారిటీ ఇచ్చాడు.

చిరు-బాలయ్య రెడీ..మరి బోయపాటి?
గతంలో ఓ పబ్లిక్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి నేరుగా బాలయ్యతో మన కోసం ఏ దర్శకుడైనా వచ్చి కథ చెప్తే చేడానికి నేను రెడీ..మరి బాలయ్య నువ్వు..అనగానే, డబుల్ ఎనర్జీతో బాలయ్య నేనెప్పుడైనా రెడీ అన్నాడు. దాంతో, స్టేజ్ కింద ఉన్న బోయపాటికి చిరు ఛాలెంజ్ విసిరారు..నేను, బాలయ్య రెడీ మరి మాకు సరిపోయే కథతో వస్తావా అని. అంటే, వీరికి కలిసి నటించాలనే ఆరాటం ఉంది. కానీ, వీరిని మెప్పించి, అభిమానులను నొప్పించని కథ కావాలి. అది రెడీగా ఉంటే ఈ మల్టీస్టారర్ కూడా వర్కౌట్ అవుతుంది.


