సినిమా

NTR-Allu Arjun: ఈ కాంబినేషన్‌లో సినిమా చాలా కష్టం..!

రచన: Anshu••5 నిమిషాల పఠనం

NTR-Allu Arjun: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలు ఎన్నో ఏళ్ళుగా వస్తున్నాయి. భారీ విజయాలను అందుకుంటున్నాయి. అయితే, బాహుబలి తర్వాత అలాంటి భారీ మల్టీస్టారర్ సినిమాలు మన సౌత్ నుంచే వస్తున్నాయి..భారీ సక్సెస్‌ను సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఇప్పుడు ఓ క్రేజీ కాంబినేషన్‌లో మల్టీస్టారర్ చిత్రానికి ప్లాన్ చేస్తున్నట్టుగా అటు తమిళం ఇటు తెలుగు సినీ పరిశ్రమలలో వార్తలు వస్తున్నాయి. ఆ కాంబినేషనే మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ –ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లతో చేసే మల్టీస్టారర్.

ఆర్ఆర్ఆర్ తర్వాత దర్శకుల ఆలోచన మారింది:

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో చేసి ఆస్కార్ అందుకున్నాడు. తారక్, చరణ్ చేసిన మొదటి పాన్ ఇండియా సినిమా కూడా ఆర్ఆర్ఆర్ కావడం విశేషం. కరోనా సమయంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని తీసిన ఆర్ఆర్ఆర్ మూవీతో అటు తారక్, ఇటు చరణ్‌లకి గ్లోబల్ వైడ్‌గా క్రేజ్ వచ్చింది. ఆర్ఆర్ఆర్ తర్వాత నుంచి వీరిద్దరు పాన్ ఇండియా సినిమాలనే చేస్తున్నారు.

పుష్ప సిరీస్‌తో గ్లోబల్ మార్కెట్‌లో క్రేజ్:

స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్..ఈ ఫ్రాంఛైజీస్‌తో తన మార్కెట్‌ను గ్లోబల్ స్థాయిలో బాగా పెంచుకున్నాడు. ఒక రీజినల్ సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. దీంతో, ఇప్పుడు ఐకాన్ స్టార్ సినిమా బడ్జెట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుత, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో చేస్తోన్న రాకా సినిమా బడ్జెట్ దాదాపు 700 కోట్లని సమాచారం. దీని, తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమాను, మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్నాడు.

ఎన్టీఆర్-అల్లు అర్జున్:

అయితే, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఎన్టీఆర్-అల్లు అర్జున్ లతో ఓ భారీ మల్టీస్టారర్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పుడు అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలలో ప్రచారం ఊపందుకుంది. ఈ పవర్‌ఫుల్ కాంబోను ప్రకటిస్తే గ్లోబల్ వైడ్‌గా అసాధారణమైన క్రేజ్ వస్తుంది. కానీ, ఈ కాంబోను సెట్ చేయడం అంత సులభం కాదంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఎన్టీఆర్-అల్లు అర్జున్ లకి ఇప్పుడు పాన్ ఇండియా వైడ్‌గా ఉన్న ఇమేజ్ తెలిసిందే. వీరికి సరిపోయే కథ..అందులో సమానంగా వీరి పాత్రలు తయారు చేయాలంటే కత్తిమీద సాము. కథతో ఇద్దరినీ ఒప్పించాలి. అది దర్శకులకి పెద్ద ఛాలెంజ్. కానీ, ట్రై చేస్తే సాధ్యపడుతుందనడంలో సందేహమే లేదు. మరి, ఆ సత్తా ఉన్న దర్శకుడేరో చూడాలి.

#Nelson Dilip Kumar#NTR#Allu Arjun#Tollywood#Kollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి