National

Neha Bhora: ఢిల్లీని వణికిస్తున్న 29 ఏళ్ల రీసెర్చ్ స్కాలర్.. ఎవరీ నేహా బోరా?

రచన: Mahesh••6 నిమిషాల పఠనం

Neha Bhora: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఆందోళనల్లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగిపోతోంది. ఎన్నికల సంఘం తీరుపై, ఓటర్ల జాబితా సవరణలోని అవకతవకలపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసనల తర్వాత దేశం మొత్తం దృష్టిని ఆకర్షించిన యువ ఉద్యమ నేత నేహా బోరా.

Neha Bhora: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఆందోళనల్లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగిపోతోంది. ఎన్నికల సంఘం తీరుపై, ఓటర్ల జాబితా సవరణలోని అవకతవకలపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసనల తర్వాత దేశం మొత్తం దృష్టిని ఆకర్షించిన యువ ఉద్యమ నేత నేహా బోరా. రాహుల్ గాంధీ లాంటి అగ్ర నాయకులు సైతం ఆమెను ముందుపెట్టి ఆందోళనలు చేసే స్థాయికి ఆమె క్రేజ్ పెరిగిపోయింది. జంతర్ మంతర్ నుంచి పోలీస్ కస్టడీ వరకు.. పోలీసులు పదే పదే అదుపులోకి తీసుకుంటున్నా ఏమాత్రం బెదరకుండా నినదిస్తున్న ఈ 29 ఏళ్ల విద్యార్థి నాయకురాలి వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.

కుటుంబం బీజేపీ.. ఈమె మాత్రం వామపక్ష ఉద్యమంలో

నేహా బోరా నేపథ్యం అత్యంత ఆసక్తికరమైనది. ఉత్తరాఖండ్‌లోని ఖతీమాకు చెందిన నేహా తండ్రి ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. తండ్రి ఆర్మీ ఉద్యోగం వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో బాల్యం గడిచినప్పటికీ, చివరకు ఉత్తరాఖండ్‌లోనే పెరిగారు. ఆమె కుటుంబం మొత్తం పూర్తిగా బీజేపీకి మద్దతు ఇస్తుంది. కుటుంబమంతా ఒక సిద్ధాంతంలో ఉంటే, నేహా మాత్రం అందుకు పూర్తి భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. దీనివల్ల ఇంట్లో తీవ్రమైన సిద్ధాంతపరమైన విభేదాలు కూడా వచ్చేవని ఆమె స్వయంగా చెప్పారు.

హిందూ కాలేజీ నుంచి జేఎన్యూ వరకు..

చదువులో ఎప్పుడూ ముందే ఉండే నేహా, ఢిల్లీ యూనివర్సిటీలోని ప్రతిష్టాత్మక హిందూ కాలేజీలో సోషియాలజీలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి పీజీ పట్టా అందుకున్నారు. ప్రస్తుతం ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఎస్థెటిక్స్‌లో థియేటర్ అండ్ పెర్ఫార్మెన్స్ స్టడీస్ విభాగంలో డాక్టోరల్ రీసెర్చ్ స్కాలర్‌గా కొనసాగుతున్నారు.

స్ట్రీట్ ప్లేస్ (వీధి నాటకాలు) వేస్తూ కళాకారిణిగా సమాజంలోని అన్యాయాలను ప్రశ్నించిన ఆమె, 2019-2020లో జరిగిన సీఏఏ వ్యతిరేక పోరాటాల్లో కీలకంగా వ్యవహరించారు. సీపీఐ (ఎంఎల్) అనుబంధ విద్యార్థి సంఘమైన 'ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్' లో చేరి, తన నాయకత్వ పటిమతో అంచెలంచెలుగా ఎదుగుతూ ఏకంగా ఆ సంస్థ జాతీయ అధ్యక్షురాలి బాధ్యతలు చేపట్టారు.

వెనక్కి తగ్గని నిరసన స్వరం

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల వేళ జంతర్ మంతర్ అందుబాటులో లేకపోవడం, సీజేపీ నేతల అరెస్టులతో నేహా బోరా స్వయంగా రంగంలోకి దిగారు. ఢిల్లీ హాట్ లాంటి ప్రత్యామ్నాయ వేదికలపై నిరసనలు చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విద్యార్థులపై లాఠీఛార్జ్, కాల్పుల ఘటనలపై ఆమె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. "పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే విద్యార్థుల ప్రాణాలను లెక్కచేయకుండా కాల్పులు జరిపారా? అలాగైతే ఉన్నతాధికారులపైనే విచారణ జరిపి వారిని బర్తరఫ్ చేయాలి" అంటూ అధికారుల తీరును సూటిగా నిలదీశారు.

పోలీసులు ఆమెను ఎన్నిసార్లు నిర్బంధించినా, కస్టడీలో ఉన్న వ్యాన్ నుంచే మద్దతుదారులతో మాట్లాడుతూ పోరాటాన్ని ముందుకు నడిపిస్తున్న ఆమె తీరు ఇప్పుడు యావత్ దేశాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఢిల్లీ వీధుల్లో ఆమె చూపిస్తున్న దూకుడు చూస్తుంటే రాబోయే రోజుల్లో భారత రాజకీయాల్లో నేహా బోరా మరింత కీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

#Neha Bhora#JNU#Jawaharlal Nehru University#Student Activist#AISA#All India Students Association#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి