సినిమా

Lenin Movie: అఖిల్ మాస్ రాంపేజ్.. 10 రోజుల్లో లాభాలెంతంటే..?

రచన: Anshu3 నిమిషాల పఠనం

Lenin Movie: అఖిల్ అక్కినేని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మాస్ బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతున్న 'లెనిన్' మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నాన్‌స్టాప్ రచ్చ చేస్తోంది. మొదటి రోజు నుంచే సాలిడ్ కలెక్షన్లతో ట్రెండ్ సెట్ చేసిన ఈ యాక్షన్ డ్రామా, రెండో వారంలోనూ అదే జోష్‌ను చూపిస్తోంది. థియేటర్ల దగ్గర ఎక్కడా తగ్గకుండా ఊరమాస్ ర్యాంపేజ్‌ను కొనసాగిస్తూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

సాధారణంగా ఏ సినిమాకైనా మొదటి వారం తర్వాత కలెక్షన్లు డ్రాప్ అవ్వడం సహజం. కానీ, 'లెనిన్' విషయంలో సీన్ రివర్స్ అయింది. ఎలాంటి హాలిడేస్ అడ్వాంటేజ్ లేకపోయినా, నార్మల్ టికెట్ రేట్స్‌తోనే థియేటర్లను హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడేలా చేస్తోంది. మొదటి వారంలోనే సేఫ్ జోన్‌కు వచ్చేసిన ఈ సినిమా, ఇప్పుడు ఏకంగా రూ. 30 కోట్ల షేర్ మార్క్‌ను దాటేసి సరికొత్త రికార్డుల వైపు అడుగులు వేస్తోంది.

ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ రన్ ప్రకారం.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను దాటి ఏకంగా రూ. 10 కోట్లకు పైగా నికర లాభాలను సొంతం చేసుకుని నిర్మాతలను, బయ్యర్లను ఫుల్ హ్యాపీ మోడ్‌లోకి నెట్టేసింది. ఒక పక్కా కమర్షియల్ హిట్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న అఖిల్ ఫ్యాన్స్‌కు ఈ సినిమా ఊరమాస్ ట్రీట్‌గా నిలిచింది.

సెకండ్ వీకెండ్‌లోనూ స్ట్రాంగ్ హోల్డ్‌ను ప్రదర్శిస్తున్న 'లెనిన్' లాంగ్ రన్‌లో చాలా ఈజీగా రూ. 15 కోట్ల మార్జిన్ లాభాలను అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే, రాబోయే కొద్ది రోజుల్లోనే రూ. 40 కోట్ల షేర్ క్లబ్‌లోకి అఖిల్ అడుగుపెట్టడం గ్యారెంటీ అని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

#akhilakkineni#lenin#bhagyasriboarse#lenincollections
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి