ఏపీ

Ap : మహిళతో వచ్చి నకిలీ పోలీస్ హల్చల్.. గదిలోకి వెళ్లి డోర్స్ క్లోజ్!

రచన: Kumar3 నిమిషాల పఠనం

ఏపీలో ఓ నకిలీ పోలీస్ కలకలం సృష్టించాడు. ఓ మహిళను తన వెంటపెట్టుకుని హోటల్‌కు వెళ్లి ఫ్రెష్ అయి వస్తామని చెప్పి డోర్ పెట్టుకున్నాడు. ఎంతకూ తలుపులు తీయకుండా లోనే ఉండపోయాడు. దీంతో సిబ్బంది పోలీసులకు కాల్ చేయగా.. అయ్యగారి అసలు స్వరూపం బయటకు వచ్చింది.

ఏపీలో ఓ నకిలీ పోలీస్ కలకలం సృష్టించాడు. ఓ మహిళను తన వెంటపెట్టుకుని హోటల్‌కు వెళ్లి ఫ్రెష్ అయి వస్తామని చెప్పి డోర్ పెట్టుకున్నాడు. ఎంతకూ తలుపులు తీయకుండా లోనే ఉండపోయాడు. దీంతో సిబ్బంది పోలీసులకు కాల్ చేయగా.. అయ్యగారి అసలు స్వరూపం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం తిరుపతిలో హాట్‌టాపిక్ అయ్యింది.

ఇటీవలి కాలంలో కొందరు పోలీసు డ్రెస్ వేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడటం, నేరాలు చేయడం, దోపిడీలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. పలువురిని బెదిరించి డబ్బులు గుంజుతున్నట్టు చాలానే కథనాలు వచ్చాయి. ట్రాఫిక్ పోలీసుల రూపంలోనూ వాహనాలను ఆపుతూ డబ్బులు వసూలు చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా తిరుపతిలో జరిగిన ఘటన పోలీసులను సైతం విస్మయానికి గురిచేస్తున్నది.

వివరాల్లోకివెళితే.. తిరుపతిలో ఓ నకిలీ పోలీస్ హల్చల్ చేశాడు. అలిపిరి వద్ద విహా హోమ్ స్టే మేనేజర్‌ను బెదిరించి రూమ్ తీసుకున్నట్టు తెలిసింది. ఓ మహిళతో హోం స్టేకి వచ్చిన సదరు నకిలీ పోలీస్.. ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేయగా.. సిబ్బంది ఇచ్చారు. రూమ్ తీసుకొని ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో వారికి అనుమానం కలిగింది. తలుపు తట్టినా స్పందించకపోవడంతో హోం స్టే స్టాఫ్ పోలీసులకు సమాచారం అందించారు.

https://x.com/RTVnewsnetwork/status/2078495790562246922?s=20

అక్కడకు చేరుకున్ పోలీసులు.. సదరు వ్యక్తిని బయటకు తీసుకొచ్చి విచారణ చేపట్టగా నకిలీ పోలీసుగా గుర్తించి పోలీస్ స్టేషన్ తరలించారు. పట్టుబడ్డ వ్యక్తి గుంటూరు జిల్లా, చోడయపాలెంకు చెందిన దాసరి కార్తీక్‌గా గుర్తించారు. అనంతరం అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

#fake police#tirupathi#alipiri#police case file#crime
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి