తెలంగాణ

Congress : బోరున ఏడ్చేసిన కొండా సుస్మిత.. వీడియో వైరల్

రచన: Kumar4 నిమిషాల పఠనం

అధికార కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ ఎపిసోడ్ ముగిసిపోయినా ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించిన తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమెను తప్పించడం సరైనదే అని కాంగ్రెస్ శ్రేణులు అంటుండగా..బీసీ బిడ్డను ఇంతలా అవమానిస్తారా? అంటూ ప్రతిపక్షాలు, బీసీ సామాజిక వర్గం నుంచి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అధికార కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ ఎపిసోడ్ ముగిసిపోయినా ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించిన తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమెను తప్పించడం సరైనదే అని కాంగ్రెస్ శ్రేణులు అంటుండగా..బీసీ బిడ్డను ఇంతలా అవమానిస్తారా? అంటూ ప్రతిపక్షాలు, బీసీ సామాజిక వర్గం నుంచి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇక తనను తప్పించడం వెనుక పెద్ద కుట్ర జరిగిందనికొండా సురేఖ అదే పనిగా మీడియాకు చెబుతూ వస్తున్నారు.

కాంగ్రెస్ హైకమాండ్‌కు తనను మంత్రి పదవి నుంచి తొలగించడం ఇష్టం లేదని, సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేయడం వల్లే తనను బర్తరఫ్ చేశారని ఆమె పేర్కొన్నారు. మంత్రివర్గంలోనే కాకుండా కాంగ్రెస్ పార్టీ నేతలు భారీగా అవినీతికి పాల్పడుతున్నారని, తన మాజీ ఓఎస్డీ సుమంత్‌ను కూడా కావాలనే ఇరికించారని మాజీ మంత్రి ఆరోపించారు. త్వరలోనే అన్ని విషయాలు బయటపెడతానని ప్రకటించారు.దీనికి తోడు నిన్న ఫేస్‌బుక్‌లో ఆసక్తికర పోస్టు పెట్టిన కొండా సురేఖ.. త్వరలోనే తన పొలిటికల్ కెరీర్ మీద బిగ్ అప్డేట్ ఇస్తానని.. వెయిట్ చేయాలని హింట్ ఇచ్చారు.

కాగా, కొండా సురేఖ ఎపిసోడ్ మీద తాజాగా కొండా సుస్మిత స్పందించారు. తన తల్లికి జరిగిన అవమానంపై సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో సీఎం రేవంత్ మీద మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. అనంతరం కన్నీళ్లు పెట్టుకుంటూ కొండా సుష్మిత భోరున ఏడ్చేశారు. ‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వల్ల ఈ స్థాయికి వచ్చిన మా అమ్మానాన్నలను ఇంతగా ఇబ్బంది పెట్టాలా?మా అమ్మను ఇంత అవమానిస్తారని తెలిస్తే.. అలా మాట్లాడేదాన్ని కాదు.మా అమ్మ చేసిన ఒక్క తప్పు చూపించండి. పార్టీలో నేనైనా ఉండాలి.. ఆమె అయినా ఉండాలి అనే స్థాయికి సీఎం దిగజారుతారా?

నేను మాట్లాడిన మాటల్లో తప్పులేదు. రేవంత్‌ రెడ్డి ఇంత పగ పడతారని అనుకోలేదు. నా కుటుంబాన్ని టార్గెట్‌ చేస్తున్నారు’ అంటూ సుష్మిత ఆవేదన వ్యక్తంచేశారు. తల్లి కొండా సురేఖపై అవమానకరంగా వ్యవహరించారని కన్నీటి పర్యంతం అయ్యారు. సుస్మిత భావోద్వేగంతో చేసిన వీడియోపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నీ వల్లే మీ తల్లి పదవి పోయిందంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.

https://x.com/greatandhranews/status/2096426439260401903?s=20

#konda sureka#konda susmitha#politics#congress#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి