క్రైమ్

Crime : న్యూడ్ పిక్స్ తీసి వేధిస్తున్న కాంగ్రెస్ నేత.. మహిళ ఆత్మహత్యాయత్నం!

రచన: Kumar3 నిమిషాల పఠనం

అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నేత ఒకరు మహిళను వేధింపులకు గురిచేస్తున్నట్టు తెలిసింది. ఆమె న్యూస్ ఫొటోస్ తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు సమాచారం.ఈ ఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో ఆదివారం ఉదయం వెలుగుచూసింది.

అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నేత ఒకరు మహిళను వేధింపులకు గురిచేస్తున్నట్టు తెలిసింది. ఆమె న్యూస్ ఫొటోస్ తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు సమాచారం.ఈ ఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో ఆదివారం ఉదయం వెలుగుచూసింది.బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు చర్యలు తీసుకోకుండా సదరు మహిళనే బెదిరింపులకు గురిచేస్తున్నట్టు సమాచారం.

వివరాల్లోకివెళితే.. బక్కమంతులగూడెనికి చెందిన ఓ మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ నేత చింతారెడ్డి విజయభాస్కర్ ఆమె ఇంట్లోకి చొరబడినట్టు సమాచారం.ఆమె బట్టలు మార్చుకుంటుండగా తన ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు తీసి ఆమెను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నట్టు తెలిసింది. తాను అడిగింది ఇవ్వకపోతే ఆమెకు చెందిన న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బాధితురాలిని వేధింపులకు గురిచేస్తున్నట్టు సమాచారం.

https://x.com/pulsenewsbreak/status/2096497349829017951?s=20

వాట్సాప్‌లో చింతారెడ్డి అసభ్యకర మెసేజ్‌లు పంపుతూ మహిళను గత కొంతకాలంగా వేధించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నాయకుడి వేధింపులు తాళలేక సదరు బాధితురాలు పోలీసులను ఆశ్రయించినట్టు సమాచారం. అధికార పార్టీకి చెందిన నేత కావడంతో పోలీసులు అతని మీద చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నట్టు తెలిసింది.

https://x.com/pulsenewsbreak/status/2096473982316974161?s=20

నిందితుడితో రాజీ చేసుకుని కేసు వెనక్కి తీసుకోవాలని పోలీసుల నుంచి బెదిరింపులు వస్తున్నట్టు బాధితురాలు ఆరోపించినట్టు తెలుస్తోంది. అటు నిందితుడి వేధింపులు, ఇటు పోలీసుల బెదిరింపులు తాళలేక చివరకు ఆ మహిళ ఆత్మహత్యాయత్నం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధిత మహిళ కుటుంబ సభ్యుల బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగినట్టు సమాచారం.

#nude pics#congress leader#harrasment#suryapet#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి