సినిమా

Actor Prithiveeraj: రాకా షుటింగ్ అనుభవాలను పంచుకున్న సీనియర్ నటుడు..

రచన: Anshu4 నిమిషాల పఠనం

Actor Prithiveeraj: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా రాకా. అట్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా జరుగుతోంది. అయితే, తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ నటుడు పృథ్విరాజ్ అప్‌డేట్‌ని పంచుకున్నాడు. అల్లు అర్జున్‌తో సినిమా చేయడం పెద్ద డ్రీమ్ అని ఆయన తెలిపాడు.

పెళ్లి సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు పృథ్విరాజ్. జగపతి బాబు, రాశీ జంటగా నటించారు. ఆ సమయంలో పృథ్విరాజ్ నటుడిగా మంచి పాత్రలను చేసి ఆకట్టుకున్నాడు. తెలుగుతో పాటు తమిళ భాషలలోనూ మంచి పాత్రలను చేశాడు. మధ్యలో కొన్నేళ్ళ పాటు గ్యాప్ వచ్చింది. ఇక, కంబ్యాక్ ఇచ్చిన ఈ టాలెంటెడ్ నటుడు స్మాల్ స్క్రీన్ మీద టాక్ షోస్ లో సందడి చేస్తూనే సినిమాలలోనూ నటిస్తున్నాడు.

ఈ క్రమంలోనే రాకా సినిమాలో కీలక పాత్ర దక్కినట్టుగా చెప్పాడు. ఇప్పటి వరకూ ఈ సినిమాలో అల్లు అర్జున్, దీపిక పడుకొనె మాత్రమే అఫీషియల్‌గా నటిస్తున్నట్టు తెలుసు. ప్రాజెక్ట్ మొదలైనప్పుడే వీరిద్దరి వీడియోలను వదిలారు. ఆ తర్వాత నుంచి చాలామంది స్టార్స్ నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. గానీ, వాళ్ళెవరనేది మాత్రం రివీల్ కావడం లేదు. కానీ, తాజాగా పృథ్విరాజ్ రాకాలో నటిస్తున్న విషయాన్ని, దర్శకుడు అట్లీ, హీరో అల్లు అర్జున్‌లతో కలిసి పనిచేసిన అనుభవాలను పంచుకున్నాడు.

ఇక, ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ మరో హీరోయిన్‌గా నటుస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారట. రెండు భాగాలుగా తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఓ మాఫియా బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతున్నట్టుగా తెలుస్తోంది. కాగా, ఈ సినిమా కోసం వందల మంది వీఎఫెక్స్ బృందం ఇతర దేశాల నుంచి వర్క్ చేస్తోంది. విశేషమేమిటంటే దీపిక ఇందులో రియల్ లైఫ్ లో ప్రెగ్నెంట్ అవగా..సినిమాలోనూ ఒరిజినల్ బేబీ బంప్ తో నటించడం.

#Allu Arjun#Raaka#Atlee Kumar#Deepika Padukone#Actor Prithiveeraj
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి