రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ మేరకు దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులను ఫిల్టర్ చేసింది. లక్షల్లో దరఖాస్తులు రాగా అందులో అర్హులను గుర్తించి ఇటీవల ఎంపిక చేసిన ప్రాంతాల్లో లక్కీ డ్రా తీసిన విషయం తెలిసిందే. మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో లాటరీ ప్రక్రియ కొనసాగింది. అయితే, ఇందిరమ్మ ఇళ్లు లాటరీలో పాల్గొనాల్సిన లబ్దిదారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ముందుగా రూ.10 వేల డిపాజిట్ కట్టించుకుంది.
లాటరీలో ఎంపికైన వారికి ఆ డబ్బులు తిరిగి చెల్లించరు. ఎవరైతే లాటరీలో పేరు రాని వారు ఉంటారో వారికి మాత్రం డబ్బులు తిరిగి చెల్లిస్తామని అధికారులు ముందే ప్రకటించారు. అయితే, మొత్తం నాలుగు నియోజకవర్గాల్లో 14,201 దరఖాస్తులను ఫైనల్ చేయగా. 1,920 మందికి లాటరీలో ఎంపికయ్యారు. వీరికి ఆయా నియోజకవర్గాల్లో నిర్మించి ఇందిరమ్మ టవర్స్‌లో ఫ్లాట్స్ కేటాయించనున్నారు.
ఇదిలాఉండగా, ఎంపికైన లబ్ధిదారుల అర్హతపై అధికారులు మరోసారి విచారణ జరపనున్నట్టు సమాచారం. అందులో లబ్దిదారులు అనర్హులు తేలితే వారి ఎంపిక రద్దు చేసి మరోసారి లాటరీ ప్రక్రియ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఈ విచారణ ప్రాసెస్ పూర్తయిన తర్వాతే మిగిలిన వారికి రూ.10 వేలు తిరిగి చెల్లించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, దరఖాస్తు రుసుము చెల్లించేందుకు తాము అప్పులు చేశామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
https://x.com/pulsenewsbreak/status/2096462642110181611?s=20
కాగా, క్యూర్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్ నిర్మించి పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించింది.ఇటీవల సీఎం రేవంత్ చేతుల మీదుగా టవర్స్ నిర్మాణానికి శంకుస్థాపన సైతం చేశారు.టవర్స్ చుట్టుపక్కలే జనాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సైతం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలాఉండగా, సబ్సిడీ కింద మధ్యతరగతి ప్రజలకు సైతం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సగభాగం ప్రభుత్వం ఖర్చు చేస్తే మిగతా సగం రుణం రూపంలో బ్యాంకుల నుంచి లబ్దిదారులకు ఇప్పించనుంది. ఫలితంగా ఈఎంఐ రూపంలో ఇల్లు వచ్చిన వారు చెల్లించాల్సి ఉంటుంది.









