సినిమా

Kayadu Lohar: నన్ను అసభ్యకరంగా చూపిస్తా అంటే ఒప్పుకోను!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Kayadu Lohar: వెండితెరపై వెలిగిన అగ్ర తారల్లో వేళ్ళపై లెక్కపెట్టే వాళ్ళే ఇప్పటి జనరేషన్ హీరోయిన్స్ లో కూడా హద్దుల్లో ఉండి సినిమాలు చేస్తూ..సత్తా చాటుతున్నారు. కొందరు మాత్రం, స్టార్ హీరోయిన్‌గా వెలగాలని లిమిటేషన్స్ ఏమీ పెట్టుకోకుండా, కాస్ట్యూంస్ దగ్గర్నుంచి సినిమాలో ఉన్న పాత్ర..దానికి తగ్గట్టుగా స్కిన్ షో చేయడానికి, హద్దులుదాటి రొమాంటిక్ సీన్స్ చేయడానికి రెడీ అంటున్నారు.

ఒకప్పుడు, సావిత్రి..అ దేజనరేషన్‌లో ఉన్న హీరోయిన్స్ జయప్రద, జమున, కాంచన, భానుమతి, విజయ నిర్మల లాంటి వారు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. కానీ, వస్త్రాధారణలో గానీ, నటనలో గానీ ఎప్పుడూ హద్దులు దాటలేదు. ఆ తర్వాత సౌందర్య పేరు ఎక్కువగా వినిపించింది. అయితే, కెరీర్ కాస్త స్లో అయి..మిగతా హీరోయిన్స్ నుంచి పోటీ ఎక్కువయ్యేసరికి అందాల ఆరబోతకి ఓకే చెప్పక తప్పలేదు.

ఇక, ఇప్పటి హీరోయిన్స్ ఆన్ స్క్రీన్ మీద కాకుండా ప్రమోషనల్ ఈవెంట్స్‌లోనే స్కిన్ షో చేసేస్తున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ అని..హీరోయిన్‌ని కొన్ని సినిమాలలో మరీ ఎక్కువగా అందాల ఆరబోతకి ఒప్పిస్తున్నారు. అంతేకాదు, అవసరం ఉన్నా లేకపోయినా హీరోతో లిప్ లాక్‌కి సరేననిపిస్తున్నారు. కానీ, ఇవేవీ సినిమా సక్సెస్‌కి అసలు కారణాలు కానేకావు. కథ మాత్రమే సక్సెస్‌కి అసలు కారణం..ఆ తర్వాత కాస్ట్ అండ్ క్రూ.

ఈ విషయంలో యంగ్ హీరోయిన్ కయాదు లోహర్ చాలా స్పష్టంగా ఉంది. స్క్రీన్‌పై తనని ఏ దర్శకుడైనా అసభ్యకరంగా చూపిస్తానంటే అసలు ఒప్పుకునే ప్రసక్తే లేదని..దేన్నైనా ఒక హద్దువరకే ఒప్పుకుంటానని తేల్చి చెప్పింది. మహిళలను ఓ అనవసరపు వస్తువులా చూపిస్తానంటే నచ్చదని చెప్పింది. దీన్ని, బట్టి కయాదు ఫ్యూచర్‌లో ఎలాంటి సినిమాలతో ఎంటర్‌టైన్ చేయాలనుకుంటుందో అర్థమైంది. కాగా, ఇదే నెలలో మూడు సినిమాలతో వచ్చింది. ఇదయం మురళి, ఇమ్మోర్టల్, ఐయామ్ గేమ్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంటున్నాయి.

#Kayadu Lohar#The Paradise#Immortal#I Am Game#Idhayam Murali
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి