నేపాల్ వరదలు ఎంత బీభత్సాన్ని సృష్టించాయో అందరికీ తెలుసు.ఈ ఉపధ్రవం నుంచి హిమాలయాల దేశం ఇంకా కొలుకోవడం లేదు. ఘటన జరిగి రెండు వారాలు కావొస్తున్న ఆ ఘోరాన్ని నేపాల్ ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. రూ. వేల కోట్లలో ఆస్తి నష్టం సంభవించగా.. సుమారు 1400 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు అంచనా వేశారు. ఇక 4000 మంది ప్రజలు ఏమయ్యారో ఇంతవరకూ తెలియరాలేదు. వారంతా వరదల్లో కొట్టుకుపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఘటన జరిగిన ప్రాంతాలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
బురద, శిథిలాల కింద సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపడుతుండగా.. గుట్టలుగా మృతదేహాలు దర్శనమిస్తున్నాయి. అయితే, నేపాల్‌లో తాజాగా మరో మిరాకిల్ చోటుచేసుకుంది. ఇటీవల సహాయకచర్యల్లో భాగంగా రెస్క్యూ బృందాలు ఓ చిన్నారని ప్రాణాలతో కాపాడిన విషయం తెలిసిందే. బాడీ మొత్తం బురదలో కూరుకుపోగా.. ఐదు రోజుల పాటు తిండి, నీళ్లు లేకున్నా ఆ చిన్నారి మరణాన్ని జయించింది.
తాజాగా అలాంటి ఘటనే మరోకటి వెలుగుచూసింది. వరదలు సంభవించిన 11 రోజుల తర్వాత 64 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలతో బయటపడింది. వరదల ధాటికి నువాకోట్‌లో చందిక శ్రేష్ఠ(64) 11 రోజుల పాటు ఇంటి శిథిలాల కింద చిక్కుకుపోయారు. రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా పోలీస్ ఫోర్స్ ఆమెను కాపాడి సురక్షితంగా బయటకు తెచ్చారు. ఓ భవనంలోని 4వ అంతస్తులో చందిక చిక్కుకోగా సాయుధ పోలీస్ దళం రక్షించినట్టు సమాచారం.
https://x.com/pulsenewsbreak/status/2096404766259925379?s=20
అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం వెంటనే ఖాఠ్మండుకు అధికారులు తరలించినట్టు తెలుస్తోంది. 11 రోజుల పాటు తిండితప్పలు లేకుండా ఆ వృద్ధురాలు ఎలా ప్రాణాలతో బయటపడిందనేది మిరాకిల్‌గా మారింది. ఎంతో శ్రమించి పోలీసు దళాలు ఆమెను బయటకు క్షేమంగా తీసుకురావడంతో వారి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, గల్లంతు అయిన వారి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.











