King 100: ఐశ్వర్య రాజేష్ కి గోల్డెన్ ఛాన్స్ దక్కింది. కింగ్ నాగార్జున నటిస్తున్న ఆయన 100వ సినిమా కింగ్ 100 లో నటిస్తోంది. తాజాగా, ఈ విషయాన్ని కన్‌ఫర్మ్ చేసింది ఐశ్వర్య. రా.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 24న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. నాగార్జున బర్త్ డే సందర్భంగా వదిలిన గ్లింప్స్ తో ఈ సినిమా హిట్ ఖాయమనే భావన అందరిలో కలిగింది. ఈ గ్లింప్స్ ని ఐశ్వర్య కూడా తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేసింది.
సంక్రంతికి వస్తున్నాం సినిమాతో తెలుగులో సాలీడ్ హిట్ అందుకుంది ఐశ్వర్య రాజేష్. వెంకీ సరసన మంచి నటనతో ఆకట్టుకొని విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. అయితే, ఈ సినిమా తర్వాత తెలుగులో ఆశించినంతగా తనకి హీరోయిన్ ఛాన్సులు రావడం లేదని ఆవేదన చెందింది. సంక్రాంతికి వస్తున్నాం అంత పెద్ద హిట్ అయినా కూడా నాకు ఇక్కడ ఛాన్సులివ్వడం లేదని సన్నిహితుల వద్ద వాపోయింది.
అయితే, ఇటీవల కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంస్ లో నాగార్జున సరసన అలాగే, బాలయ్య సినిమాలోనూ ఐశ్వర్య రాజేష్ ఛాన్స్ వచ్చిందని ప్రచారం జరిగింది. బాలయ్య సినిమాలో నటిస్తున్న విషయంలో క్లారిటీ లేకపోయినా, నాగ్ సినిమాలో మాత్రం ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ. ఈ విషయాన్ని కన్‌ఫర్మ్ చేస్తూ కింగ్ 100 గ్లింప్స్ ని తన స్టోరీలో షేర్ చేసింది.
తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రా.కార్తీక్ కింగ్ 100 ని తెరకెక్కిస్తున్నాడు. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమాలో టబు, సుష్మిత భట్ నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున ఫ్యామిలీ నిర్మిస్తోంది. ఇక, ఈ సినిమాతో పాటు ఐశ్వర్య రాజేష్ దిల్ రాజు నిర్మాణంలో రూపొందబోతున్న రవితేజ సినిమాలోనూ హీరోయిన్‌గా ఛాన్స్ అందుకుందట. హసిత్ గోలి దర్శకుడు.











