సినిమా

RGV: యంగ్ డైరెక్టర్లకు రాంగోపాల్ వర్మ క్లాస్.. : ‘ధురంధర్’పై సంచలన విశ్లేషణ!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

'సత్య', 'కంపెనీ' వంటి చిత్రాలతో భారతీయ సినిమాలో వాస్తవిక ధోరణికి తెరతీసిన సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఇటీవల విడుదలైన 'ధురంధర్' చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా రెండోసారి ఈ సినిమాను వీక్షించిన ఆర్జీవీ భారీ బడ్జెట్, కమర్షియల్ సినిమాల ధోరణిని విమర్శిస్తూ, 'ధురంధర్'ను ఒక నిజమైన సినిమాగా అభివర్ణిస్తూ ఆయన సుదీర్ఘంగా ట్వీట్ చేశారు.

'సత్య', 'కంపెనీ' వంటి చిత్రాలతో భారతీయ సినిమాలో వాస్తవిక ధోరణికి తెరతీసిన సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఇటీవల విడుదలైన 'ధురంధర్' చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా రెండోసారి ఈ సినిమాను వీక్షించిన ఆర్జీవీ భారీ బడ్జెట్, కమర్షియల్ సినిమాల ధోరణిని విమర్శిస్తూ, 'ధురంధర్'ను ఒక నిజమైన సినిమాగా అభివర్ణిస్తూ ఆయన సుదీర్ఘంగా ట్వీట్ చేశారు. ఈ సినిమా నుంచి నేటి యంగ్ డైరెక్టర్లు అనేక పాఠాలు నేర్చుకోవాలని ఆయన సూచనలు చేశారు. ఈ విషయం ఇప్పుడు సినీవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

 గతంలో తాను తీసిన 'సత్య' చిత్రంలో భీకూ మాత్రే, కల్లు మామా లాంటి పాత్రలు ఎంత సహజంగా ఉంటాయో, 'ధురంధర్' ఆ సహజత్వాన్ని మరొక స్థాయికి తీసుకెళ్లిందని వర్మ కొనియాడారు. కమర్షియల్ సినిమాల్లో హీరోను ఒక 'వాకింగ్ పోస్టర్'లా, పూజించాల్సిన దేవుడిలా చూపిస్తారని.. కానీ ఈ చిత్రంలో హీరో కూడా సందర్భాన్ని బట్టి చిన్నబోతాడని, ఒంటికి మురికి అంటించుకుంటాడని విశ్లేషించారు. 'రెహ్మాన్ దకైత్' అనే పాత్ర కేవలం ఫోజుల కోసం కాకుండా, భయం, మానసిక భావోద్వేగాలు ఉన్న ఒక నిజమైన మనిషిలా తెరపై జీవించిందని ప్రశంసించారు.

 సాధారణ సినిమాల్లో పొగమంచు, స్లో మోషన్లు, స్టైల్ కోసం వాడే హింస మాత్రమే కనిపిస్తుందని, కానీ 'ధురంధర్'లో ప్రతి హింసాత్మక ఘటనకు ఒక మూల్యం ఉంటుందని ఆర్జీవీ పేర్కొన్నారు. ఇతర సినిమాల్లో మహిళా పాత్రలు కేవలం హీరో చుట్టూ తిరగడానికే పరిమితమవుతాయని ఎద్దేవా చేసిన ఆయన, ఈ చిత్రంలో ప్రతీ పాత్రకూ ఒక సొంత జీవితం ఉన్నట్లు చూపించారని తెలిపారు. ఆర్టిఫిషియల్ సినిమాల నుంచి బయటకు రాగానే కేవలం హీరో జుట్టు, నడక మాత్రమే గుర్తుంటాయని, మనుషుల ఎమోషన్లు గుర్తుండవని ఆయన విమర్శించారు.

 ఒక వైపు కెమెరాకు ఫోజులిచ్చే కృత్రిమ సినిమాలు వస్తుంటే, మరొకవైపు మాంసాన్ని కోసేంత పదునైన వాస్తవికతతో 'ధురంధర్' నిలిచిందని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. ఈ వాస్తవికతను గ్రహించి నేటి దర్శకులు తమ మేకింగ్ శైలిని మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. సినిమా పట్ల తనకు ఉన్న మక్కువను, విశ్లేషణాత్మక దృక్పథాన్ని చాటుతూ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

#RGV#RGV latest tweet#rgv dhurandhar review#Dhurandhar#RamGopalVarma#CinemaReviews#MovieNewsTelugu#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి