రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. నర్సు మీద ఓ దుండగుడు అత్యాచారయత్నం చేయడంతో పాటు ఆమె కిరాకతంగా హతమార్చాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తుక్కుగూడలో చోటుచేసుకుంది.నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. మృతురాలిని శిరీష(21) గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ అనంతరం హత్యగా ధ్రువీకరించారు.
వివరాల్లోకివెళితే.. తుక్కుగూడలోని ‘ప్రైమ్ సూపర్ స్పెషాలిటీ’ ఆసుపత్రిలో శిరీష నర్సుగా పనిచేస్తోంది. ఎప్పటిలాగే విధులు ముగించికుని వచ్చి తన గదిలో విశ్రాంతి తీసుకుంటోంది. అయితే, బిహార్‌కు చెందిన సలావుల్లా (35) స్థానికంగా ఓ బైక్ మెకానిక్ షాపులో పనిచేస్తున్నాడు. అతను పోర్న్ వీడియోలకు అడిక్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శిరీష గదిలో ఒంటరి ఉంటున్నట్టు కనిపెట్టిన అతను.. అర్ధరాత్రి కిటికి ద్వారా గదిలోకి చొరబడినట్టు సమాచారం.
ఆమె మీద అత్యాచారయత్నానికి పాల్పడ్డగా..బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆమె గొంతు నులిమి మరోసారి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా విఫలం కావడంతో ఆగ్రహానికి గురైన సనావుల్లా ఆమెను సుత్తితో కొట్టి చంపినట్టు తెలిసింది. అనంతరం అక్కడి నుంచి నిందితుడు పరార్ అయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా మృతురాలి స్నేహితులు , ఆస్పత్రి సిబ్బందిని విచారించి పలు వివరాలు సేకరించారు.
https://x.com/pulsenewsbreak/status/2094070940279992716?s=20
అనంతరం స్థానికంగా ఉంటున్న వారిని సైతం విచారిస్తుండగా సనావుల్లా పనికి రావడం లేదని గుర్తించారు.దీంతో అతని ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు ట్రాక్ చేసినట్టు సమాచారం. ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం తానే చేసినట్టు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు అతన్ని రిమాండ్‌కు తరలించినట్టు వెల్లడించారు.










