క్రైమ్

TG : కూతురిని నడుముకు కట్టుకుని ఓ తల్లి దారుణం..

రచన: Kumar4 నిమిషాల పఠనం

ఓ తల్లి దారుణానికి పాల్పడింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డను తీసుకుని బావిలో దూకింది. కుటుంబ కలహాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. తల్లిబిడ్డలు ఇద్దరు మరణించారనే విషయం తెలిసి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది.

ఓ తల్లి దారుణానికి పాల్పడింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డను తీసుకుని బావిలో దూకింది. కుటుంబ కలహాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. తల్లిబిడ్డలు ఇద్దరు మరణించారనే విషయం తెలిసి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. లింగాపూర్ గ్రామానికి చెందిన గొట్ల రజిత(26)కు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వేనుగుమట్లకు చెందిన మెరుగు అంజయ్యతో ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి కూతురు అక్షిత(6), కుమారుడు మహేందర్(18 నెలలు)ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా కొన్నాళ్లుగా రజిత తల్లిదండ్రుల వద్దే ఉంటున్నది. అయితే, అప్పుడప్పుడు వచ్చి తండ్రి పిల్లలను చూసి వెళ్తుండే వాడు.

ఆదివారం ఉదయం రజిత అమ్మానాన్నలు పనికి వెళ్లగా ఎప్పటిలాగే పిల్లలను చూసేందుకు భర్త అంజయ్య ఇంటికి వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య గొడవ జరగినట్టు సమాచారం. కాగా, పుట్టింటికి వచ్చినా భర్త వేధింపులు ఆగడం లేదని భావించిన రజిత.. అతను వెళ్లిపోయాక కొద్దిసేపటికే కుమారుడిని పడుకోబెట్టి, కుమార్తెను తీసుకుని గ్రామ సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది.

https://x.com/pulsenewsbreak/status/2094283148247130534?s=20

తన ఆరేండ్ల కూతురుని నడుముకు కట్టుకుని బాలిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోవడానికి ముందు బాధితురాలు.. జన్నారం మండలంలో ఉంటున్న తన సోదరికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పినట్టు సమాచారం. భర్త వేధింపులు తాళలేక పోతున్నానని,అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వివరించినట్టు తెలిసింది.మృతురాలి సోదరి వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన బావి దగ్గరకు వెళ్లి చూడగా తల్లికూతురు ఇద్దరూ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

#mother suicide#manchiryala#crime#family problems#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి