ఖమ్మం కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణంలో కమీషన్స్ దందా?
డేట్స్ పొడిగించుకుంటా పోయింది అందుకేనా?
కఠిన నిబందనల టెండర్స్‌తో ఏం సాధించాలనుకుంటున్నారు?
అర్హత లేకుండా చేసి టెక్నికల్ పేరుతో జాప్యం?
రద్దు చేసి మళ్లీ పిలిచే అవకాశం ఉన్నా పర్సంటేజీ కుట్రలు?
సెంట్రల్ వాటా ఉన్నా నోరెత్తని బీజేపీ నేతలు
ఏక్తామాల్, ఎడ్యుకేషన్‌లో టెండర్స్‌పై మౌనరాగం
ముగ్గురు ఐఏఎస్‌పై ఒత్తిడి తెస్తోంది ఎవరు?
టెండర్స్‌లో పెట్టిన కండిషన్స్ ఏంటి?
ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కారిడార్‌లో ఎఐ ఐసీసీసీ భవన నిర్మాణం టెండర్లో తమాషా ఏంటో స్వేచ్ఛ న్యూస్ స్పెషల్ స్టోరీ
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,
9848070809,
స్వేచ్ఛ న్యూస్ చైర్మన్.
కేంద్రం నుంచి గ్రాంట్ రూపంలో రాష్ట్రానికి 25 శాతం, లోన్స్ రూపంలో 50 శాతం సమకూర్చుకునే నిధుల టెండర్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం పర్సంటేజీలతో పరేషాన్ చేస్తోంది. అర్హత పేరుతో 1 లేదా 2 కంపెనీలకే అవకాశం ఉండేలా చూస్తోంది. 20 శాతం నుంచి 30 శాతం కమీషన్ ఇస్తేనే మీకు టెండర్ వస్తుందని ముందే తెగేసి చెప్పేస్తున్నారు. అది భరించే సంస్థలకే ఇస్తామని చెప్పడంతో అర్హత ఉన్నా చాలామంది కాంట్రాక్టర్స్ వెనకడుగు వేస్తున్నారు. ప్రధాని ఏక్తామాల్ నిర్మాణంలో రూ.100 కోట్లు ఇప్పటికే ఎస్కలేషన్ పేరుతో లేపేశారు. వంశీరాం, అపర్ణ, కంపెనీలకు కట్టబెట్టి భారీగానే వాటాలు తీసుకున్నారు. ఆ టెండర్స్‌లో వారికే అవకాశం ఇచ్చిన తీరుపై బీఆర్ఎస్ ఆందోళన చేసినా, బీజేజీ సైలెంట్‌గానే కూర్చుంది. బంకర్ బెడ్స్, విద్యార్ధుల బట్టలు టెండర్స్లోనూ ఏనాడు ప్రశ్నించలేదు. పెద్ది సుదర్శన్ రెడ్డి కేసు వేయడంతో ఆగినా, ఇప్పుడు ఆయన మరణంతో ఆ కేసు విచారణకు రావడం లేదు. వచ్చినా క్లోజ్ చేసేందుకే ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ని కూడా వదలడం లేదు
ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కారిడార్‌లో 26 అర్బన్ లోకల్ బాడీలు, 28 లక్షల జనాభాను కవర్ చేస్తూ, రూ.166 కోట్ల ఏఐ కమాండ్ సెంటర్ నిర్మాణానికి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ టెండర్స్ పిలిచింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ ఏఐ, ఐఓటీ, జీఐఎస్, క్లౌడ్ అధారిత స్మార్ట్ అర్బన్ గవర్నన్స్ ప్లాట్ ఫామ్‌ని ఏర్పాటు చేయడం లక్ష్యంగా ఎనేబుల్డ్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలనుకున్నారు. అయితే ఇందులో టెండర్లో పాల్గొన్నవి రెండు కంపెనీలే. వాళ్లు అనుకున్న కంపెనీలకు రావాలని ఇలాంటి నిర్ణయాలు పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే ఇద్దరు బిడర్లే పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీగా చేసిన మాజీ మంత్రి సన్నిహితులకు ఇవ్వాలని చూసినా వారికి అర్హత లేకపోవడంతో మరొకరికి కమీషన్స్ ఆఫర్స్‌తో నడిపిస్తున్నారు. అయినా వీరికి కూడా ఎలిజిబిలిటీ లోపాలు ఉన్నాయని సమాచారం. దీంతో కనీసం ముగ్గురు పోటీ లేని టెండర్స్ రద్దు చేస్తారా? కమీషన్స్‌తో కక్కుర్తి పడి వాళ్లకే ఇస్తారా అనేది ఆసక్తిగా మారింది. అందుకే 2 నెలలైనా ఫైనల్ చేయకుండా ఆపేస్తున్నారు. ఆర్ఎఫ్పీ (కేఎంసీ/ఏఐ ఐసీసీసీ/ఎన్ఐయూఎం/2026/01) జూలై 2026లో జారీ అయింది. అసలు బిడ్ సమర్పణ తేదీ ఆగస్టు 13 అయినప్పటికీ, సెప్టెంబర్ 24 వరకు పొడిగించారు. ప్రస్తుతం అక్టోబర్ టెండర్ గడువు ముగిసింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా చాలా కఠినంగా ఉండటం సగటు టర్నోవర్ రూ.90 కోట్లు, ఐసీసీసీ అనుభవం, సింగిల్ వర్క్ ఆర్డర్ రూ.40 కోట్లు మొదలైన వాటి వల్ల పెద్ద సిస్టమ్ ఇంటిగ్రేటర్లు రెండు కంపెనీలు మాత్రమే పాల్గొన్నట్లు అనిపిస్తోంది. ఇందుకు టీసీఐఎల్, గ్రీన్ కో లాంటి సంస్థలు కూడా ఈ ప్రాజెక్ట్‌కు కన్సార్టియం పార్టనర్ కోసం ఆసక్తి చూపించాయి. కానీ, వాళ్లు అనుకున్న కంపెనీలకు వస్తుందని ఆశపడి తొందరగానే టెండర్స్ పిలిచారు. వాళ్లు అనుకున్న ఆ సన్నిహితునికి కూడా ఎలిజిబులిటీ లేకపోవడంతో 20 శాతం కమీషన్ దందా నడుస్తోంది. అయితే, మరో రూ.80 కోట్లకు ప్రాజెక్ట్ విలువను పెంచుకునేందుకు వీలుగా పావులు కదుపుతున్నారని సమాచారం. ఎలిజిబుల్ బిడర్లు లేకపోతే టెండర్‌ను క్యాన్సిల్ చేసి రీటెండర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎలిజిబిలిటీని స్వల్పంగా సడలించడం, స్కోప్‌ను ప్యాకేజీలుగా విభజించడం, లేదా మరింత సమయం ఇవ్వడం వంటి చర్యలు తీసుకోకపోతే ప్రాజెక్ట్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. 10 సంవత్సరాల ఓ అండ్ ఎం, ఏఐ మోనటైజేషన్ ఆధారిత పెర్ఫార్మెన్స్ రిటెన్షన్ వంటి కండిషన్లు కూడా బిడర్లను పాల్గొనకుండా చేస్తున్నాయి.
ఆ ఇద్దరు ఎవరు?
టెండర్లలో ఎస్*ఆర్, బృహ**తి టెక్నాలజీ రెండు కంపెనీలు మాత్రమే పాల్గొన్నాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏఎల్ఎల్వీవై కంపెనీకి స్మార్ట్ సిటీ ఇంటిగ్రేషన్, సీసీటీవీ, ట్రాఫిక్ , వెస్ట్ మేనేజ్మెంట్ ఈ గవర్నెన్స్ పనుల్లో అనుభవం ఉన్నా, టర్నోవర్ రూ.80 కోట్లకు మించలేదు. రూ.90 కోట్ల సగటు టర్నోవర్ క్రైటీరియా పెట్టారు. ఇప్పుడు రేసులో ఉన్న రెండు కంపెనీల టర్నోవర్ రూ.200 కోట్లు ఉన్నా సింగిల్ వర్క్ ఆర్డర్ రూ.40 కోట్లు లేకపోవడం, ఇతర టెక్నికల్ క్రైటేరియా లోపం ఉందని తెలుస్తోంది. అయితే, షాడో సీఎం చక్రం తిప్పుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ టెండర్ని రద్దు చేసి మళ్లీ పిలిస్తేనే మంచి అవకాశాలు ఉంటాయనే డిమాండ్ పెరుగుతోంది.


