తెలంగాణ

TG : దసరా సెలవులు ఓవర్.. పల్లెలు విడిచి పట్టణాలకు ప్రజలు!

రచన: Kumar••4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో దసరా సెలవులు ముగిశాయి. నిన్నటివరకు కుటుంబంతో సరదాగా గడిపిన వారంతా నేడు పట్టణాలకు తిరుగుప్రయాణం అవుతున్నారు. బతుకుదెరుకు కోసం నగరాలకు వలస వెళ్లి పండక్కి సొంతూర్లకు వెళ్లినవారంతా తిరుగుప్రయాణం అవుతున్నారు.

రాష్ట్రంలో దసరా సెలవులు ముగిశాయి. నిన్నటివరకు కుటుంబంతో సరదాగా గడిపిన వారంతా నేడు పట్టణాలకు తిరుగుప్రయాణం అవుతున్నారు. బతుకుదెరుకు కోసం నగరాలకు వలస వెళ్లి పండక్కి సొంతూర్లకు వెళ్లినవారంతా తిరుగుప్రయాణం అవుతున్నారు.దీంతో పల్లెలు ఖాళీ అవుతున్నాయి. పండుగ సమయంలో భార్యబిడ్డలతో సొంతూర్లకు రావడంతో కళకళలాడిన గ్రామాలు.. మళ్లి బోసిపోనున్నాయి. సెలవులు ముగియడంతో జనాలు తిరిగి హైదరాబాద్ బాట పట్టారు.

ఇప్పటికే చాలా మంది నగరానికి వచ్చారు. నేటితో సెలవులు ముగుస్తుండటంతో పిల్లలతో కలిసి పేరెంట్స్ తిరుగు ప్రయాణం కావడంతో నగరానికి ట్రాఫిక్ పెరిగింది. దీంతో హైదరాబాద్‌‌కు వచ్చే ప్రధాన రాహదారులపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. మరోవైపు ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది. దీంతో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

ట్రాఫిక్ కష్టాలు..

సొంతూర్ల నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రజలకు భారీ ట్రాఫిక్ వెల్‌కమ్ చెబుతోంది. ఇవాళ తెల్లవారుజాము నుంచే నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ఉద్యోగులు, వ్యాపారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా, నగరంలోకి ఆర్టీసీ బస్సుల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో కొన్ని బస్సులు దిల్‌సుఖ్‌నగర్ వద్దే ప్రయాణికులను దించేశాయి. చేసేదేమీ లేక ప్యాసింజర్స్ ప్రత్యామ్నాయ మార్గాల కోసం మెట్రోను ఎంచుకున్నట్టు సమాచారం.

లోయర్ ట్యాంక్‌వైపు వాహనాలు..

అమ్మవారి విగ్రహాల నిమజ్జనం నేపథ్యంలో ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే సాధారణ వాహనాలను తెలంగాణ తల్లి ఫ్లైఓవర్, లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా మళ్లిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీని కట్టడి చేసేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సచివాలయం ముందు నుంచి హెవీ వెహికిల్స్ రాకపోకలు నిషేధించారు.నిమజ్జనం పూర్తయ్యే వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.

రేపటి నుంచి స్కూల్స్ ప్రారంభం..

బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ఈనెల 10 నుంచి 22వరకు పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.నేటితో సెలవులు ముగియడంతో శుక్రవారం నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. జూనియర్ కాలేజీలు గురువారం నుంచే పునఃప్రారంభమయ్యాయి. సెలవుల కోసం సొంతూళ్లకు వెళ్లిన విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కావడంతో ఇవాళ, రేపు నగరంలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటుందని తెలుస్తోంది.

#Dussera holidays over#Hyderabad#Full traffic#Return#City people#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి