National

National :ఎస్ఐఆర్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొననున్న కేంద్రమంత్రి భర్త..!

రచన: Kumar•••5 నిమిషాల పఠనం

ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఓట్ల చోరీకి పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడంతో కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్, కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఓట్ల చోరీకి పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడంతో కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్, కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిరసనల ప్రదేశంగా నిషేధించిన జంతర్ మంతర్‌లో ప్రొటెస్ట్ చేసినందుకు సీజేపీ లీడర్లు అశుతోష్ రంకా,సౌరవ్ దాస్‌లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

ప్రస్తుతం వారు జైలులో ఉన్నారు. పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకోవాలని చూస్తున్నారు. ఇటీవల వారి బెయిల్ పిటిషన్లపై విచారణ సందర్బంగా డిళ్లీ మెజిస్ట్రేట్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.సీజేపీ నేతలకు చట్టమంటే గౌరవం లేదని వ్యాఖ్యానించింది. ఇదిలాఉండగా, తమకు బెయిల్ రాకుండా మెజిస్ట్రేట్‌ను కేంద్రంలోని పెద్దలు బెదిరిస్తున్నారని సీజేపీ నేతలు ఆరోపించారు. వారి తరఫు లాయర్లు ఢిల్లీ హైకోర్టును సైతం ఆశ్రయించినట్టు తెలిసింది. జెన్ జీ నిరసనలు, సీఈసీకి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేలా సీజేపీ నేతలు పిలుపునివ్వడంపై ప్రస్తావించిన న్యాయస్థానం.. మీరు జెన్ జీ కాదు కదా? అని ప్రశ్నించినట్టు తెలిసింది.

అయితే, ప్రశ్నిస్తున్న గొంతులను కేంద్రంలోని బీజేపీ పెద్దలు అణచివేస్తున్నారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే రేపు అక్టోబర్ 23న ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలకు సీజేపీ,ఇతర యాక్టివిస్టులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాగా, SIR వ్యతిరేక నిరసనలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భర్త, ఎకానమిస్ట్ పరకాల ప్రభాకర్ పాల్గొననున్నారు. ఈ విషయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఎస్ఐఆర్, కేంద్రఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా నిర్వహించే నిరసనల్లో కేంద్రమంత్రి భర్త పాల్గొనుండటంతో మోడీ సర్కార్‌పై మరింత ఒత్తిడి పెరుగుతుందని చర్చ జరుగుతోంది. కాగా, పరకాల ప్రభాకర్ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు స్వాగతిస్తున్నాయి.ఆయనను అడ్డం పెట్టుకుని మోడీ సర్కార్, సీఈసీ మీద మరింత ఒత్తిడి పెంచాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదిలాఉండగా, పరకాల ప్రభాకర్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2014–2018లో ఏపీలో నాటి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వంలో కమ్యూనికేషన్స్ అడ్వైజర్‌గా పనిచేశారు. అప్పుడు ప్రభాకర్‌కు కేబినెట్ మంత్రి హోదా కల్పించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు ఏర్పడిన సమయంలో ప్రతిపక్ష విమర్శల నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నాటి నుంచి బీజేపీకి దూరంగా ఉంటున్నారు. కానీ,ఆయన భార్య నిర్మలా సీతారామన్ మాత్రం బీజేపీలో కొనసాగుతున్నారు.

#SIR#CEC gynaesh kumar#Parakala prabakar#CJP#Protest#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి