తెలంగాణ

Congress: మా ప్రభుత్వంలో అవినీతి పెరిగిందని ఒప్పుకుంటా- మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

రచన: NK••5 నిమిషాల పఠనం

Congress: కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీగా అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులు అధికారాన్ని అడ్డు పెట్టుకుని విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని, వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని ఆరోపిస్తున్నారు.

Congress: కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీగా అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులు అధికారాన్ని అడ్డు పెట్టుకుని విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని, వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో తెలుపుతూ బీఆర్ఎస్ నాయకులు పలు ఆధారాలు కూడా బయటపెట్టారు. యధేచ్చగా అవినీతికి పాల్పడుతున్న వ్యక్తుల పేర్లను కూడా వారు బహిర్గతం చేశారు. ఏ విధంగా, ఏ రేంజ్ లో కరప్షన్ జరుగుతుందో ఎవిడెన్స్ తో సహా వివరిస్తున్నారు.

అయితే, ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవినీతి ఆరోపణలు చేయడం రాజకీయాల్లో సర్వ సాధారణమే అని అనుకోవచ్చు. ఆరోపణలు చేయడమే విపక్షాల పని కూడా చెప్పొచ్చు. అది వారి పొలిటికల్ గేమ్ అనొచ్చు. కానీ, మా ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందన్నది నిజమే అని అధికార పార్టీకి చెందిన ముఖ్యమైన నాయకులే అంటే.. దాన్ని లైట్ తీసుకోవడానికి లేదు. తాజాగా అలాంటి పరిణామమే చోటు చేసుకుంది.

కాంగ్రెస్ ప్రభుత్వంలో కరప్షన్ జరుగుతోందని అనడమే కాదు.. ఏకంగా అవినీతి పెరిగిందని నేను ఒప్పుకుంటా అని సాక్ష్యాత్తు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అనడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. సొంత ప్రభుత్వంపై మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ప్రభుత్వంలో అవినీతి పెరిగిందని ఒప్పుకుంటాను అని ఆయన అన్నారు. కింది స్థాయి నుండి మంత్రుల వరకు అందరూ అవినీతి చేస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. పైగా నేను ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిని అని తేల్చి చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిందని ఒప్పుకుంటాను అంటూ మహేశ్ కుమార్ గౌడ్ అనడం ఇటు కాంగ్రెస్ శ్రేణుల్లో అటు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ శ్రేణుల్లో ఈ వ్యాఖ్యలు దుమారమే రేపాయని చెప్పాలి. ఒకరో ఇద్దరు కాదు.. దాదాపు అందరూ అవినీతికి పాల్పడుతున్నారు అంటూ బాంబు పేల్చారు మహేశ్ కుమార్ గౌడ్. మంత్రులను కూడా ఆయన వదల్లేదు. వారు కూడా కరప్షన్ చేస్తున్నారని చెప్పారు.

మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో కలకలమే రేపాయి. అసలే ముఖ్యమంత్రిని, మంత్రులను బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తోంది. ఈ పరిస్థితుల్లో మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ కు అస్త్రంలా మారి తమపై మరింతగా విరుచుకుపడే అవకాశం ఉందని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. అంతేకాదు ప్రజల్లోనూ బద్నాం కావడం ఖాయమనే భయం పట్టుకుంది. మొత్తంగా టీపీసీసీ చీఫ్ చేసిన ఈ కామెంట్స్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఎంత డ్యామేజ్ చేస్తాయో చూడాలి.

#Telangana Congress#Mahesh Kumar Goud#Tpcc#Corruption#Congress Government#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి