క్రీడలు

India vs West Indies T20 2026: టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. సిరీస్‌లో ఆధిక్యం ఎవరిదో!!..

రచన: Venu••5 నిమిషాల పఠనం

ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఆరంభంలో దూకుడుగా ఆడినా.. ఆ తర్వాత వరుస వికెట్లతో ఒత్తిడిలో పడ్డారు.

ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఆరంభంలో దూకుడుగా ఆడినా.. ఆ తర్వాత వరుస వికెట్లతో ఒత్తిడిలో పడ్డారు. మొదట టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా పవర్‌ప్లేలోనే భారీ స్కోరుకు పునాది వేసింది. అయితే భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.

వెస్టిండీస్ బౌలర్ షమార్ జోసెఫ్ బౌలింగ్‌లో సంజూ శాంసన్ 3 పరుగులకే కమిల్ పూరన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్‌తో కలిసి అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డాడు. కేవలం 18 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అర్ధశతకం పూర్తి చేశాడు. బౌండరీలతో విరుచుకుపడుతూ విండీస్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు.

ఇక పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ దూకుడుకు ఇషాన్ కిషన్ కూడా తోడవడంతో స్కోరు వేగంగా పెరిగింది. అయితే రోస్టన్ చేజ్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదిన ఇషాన్ కిషన్ 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టంపౌట్ అయ్యాడు. అదే ఓవర్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఒక్క పరుగుకే పెవిలియన్ చేరడంతో భారత్ ఒత్తిడిలో పడింది. మరోవైపు ధాటిగా ఆడుతున్న అభిషేక్ శర్మ 69 పరుగుల వద్ద షమార్ స్ప్రింగర్ బౌలింగ్‌లో క్యాచ్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు.

ఆ తర్వాత నమన్ ధీర్ 10 పరుగులకే ఔటవడంతో భారత్ 135 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. దూకుడుగా సాగిన ఇన్నింగ్స్‌లో వరుస వికెట్లు పడటంతో భారత జట్టు బ్యాటింగ్ కు, స్కోర్ వేగానికి బ్రేకులు పడ్డాయి. ఇక ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ లో భారత్ గెలవగా, రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్ విజయం సాధించింది. దీంతో సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు రెండేసి మార్పులతో బరిలోకి దిగాయి.

భారత్ తరఫున నితీశ్ కుమార్ రెడ్డి, ప్రిన్స్ యాదవ్.. కుల్దీప్ యాదవ్,శివమ్ దూబే స్థానాల్లో ఆడుతున్నారు. వెస్టిండీస్ జట్టులో కూడా మార్పులు జరిగాయి. రొమారియో షెపర్డ్, అకీల్ హొసేన్ స్థానాల్లో క్వెంటిన్ సాంప్సన్, కీమో పాల్ చోటు దక్కించుకున్నారు. ఇక ఇండోర్ హోల్కర్ స్టేడియం చిన్న బౌండరీలకు, భారీ స్కోర్లకు పేరుగాంచింది.

ఈ పిచ్‌పై బ్యాటర్లకు అనుకూల పరిస్థితులు ఉండటంతో భారీ స్కోరు నమోదవుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ తర్వాత భారత్ వరుస వికెట్లు కోల్పోవడం మ్యాచ్‌లో కీలక పరిణామంగా మారింది. సిరీస్‌లో ఆధిక్యం సాధించాలంటే మిగతా భారత బ్యాటర్లు ఇన్నింగ్స్‌ను ఎలా ముందుకు తీసుకెళ్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.. అలాగే సిరీస్ ఎవరి కైవసం అవుతుందనే ఉత్కంఠ నెలకొంది..

#sports#India vs West Indies#T20 2026#third-t20#india-make-two-changes#Abhishek Sharma#Shreyas Iyer#West Indies Cricket#Holkar Stadium
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి