తెలంగాణ

Hyderabad: నగరంలో మొదలైన దసరా సందడి.. ట్రాఫిక్ జామ్ తో నిండిపోయిన హైవేలు!!..

రచన: Venu•••3 నిమిషాల పఠనం

తెలంగాణ ప్రజలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో దసరా ఒకటి.. రాష్ట్రం నలుమూలల నుండి ఉపాధి కోసం నగరానికి వచ్చిన జనం ఈ సమయంలో పల్లె బాటపడుతారు.

తెలంగాణ ప్రజలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో దసరా ఒకటి.. రాష్ట్రం నలుమూలల నుండి ఉపాధి కోసం నగరానికి వచ్చిన జనం ఈ సమయంలో పల్లె బాటపడుతారు. ఇక స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వడంతో హైవేలపై దసరా సందడి కనిపిస్తుంది. సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. దీంతో జాతీయ రహదారి-65పై భారీగా వాహనాలు బారులు తీరాయి. లక్కారం నుంచి ధర్మోజీగూడెం వరకు చాలా దూరం వాహనాలు నిలిచిపోయాయి.

ట్రాఫిక్ జామ్ అవడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. మరోవైపు హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళే జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ పురపాలిక పరిధిలో వాహనాల రద్దీ భారీగా పెరిగింది. ఈ క్రమంలో చౌటుప్పల్‌లో నూతనంగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌ బ్రిడ్జి పనులు కూడా ట్రాఫిక్‌ సమస్యకు కారణంగా భావిస్తున్నారు. ఇక ఇక్కడ జరుగుతున్న నిర్మాణ పనుల నేపథ్యంలో వాహనాలు ఇరుకైన సర్వీస్‌ రోడ్లపై నుంచి వెళ్లాల్సి రావడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

వాహనాల సంఖ్య పెరగడంతో ఈ మార్గంలో ప్రయాణికులు ముందుకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఆదివారం సెలవు కావటంతో సొంత వాహనాల్లో హైదరాబాద్ నుండి విజయవాడ వైపు ప్రయాణిస్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దీంతో జాతీయ రహదారి మీద వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ఇక ఈ ట్రాఫిక్ లో చిక్కుకుని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సమాచారం.

ఈ సమయంలో వాహనాల రద్దీని తగ్గించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు ప్రతి దసరా పండుగ సమయంలో ఇలాంటి పరిస్థితులు సాధారణంగా ఎదురవుతాయి. కానీ ఈసారి పరిస్థితి మరింత క్లిష్టంగా మారినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు కీలక సూచనలు చేస్తున్నారు. ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగా ప్లాన్ చేసుకోవాలని పేర్కొంటున్నారు..

#telangana#Dasara festivities#city highways traffic jams#dasara-holidays#hyderabad-vijayawada
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి